లైంగిక వేధింపులు - అత్యాచారం కేసులో అరెస్టు అయిన గుర్మీత్ రామ్ రహీం బాబా బాటలోనే ఆయన శిష్యులు నడుస్తున్నట్లుగా ఉంది. అత్యాచార కేసులో గురువు డేరాబాబా శిక్షను అనుభవిస్తున్న సంగతి తెలిసిందే...అయితే ఆయన శిష్యుడు ఒకడు నడుపుతున్న సెక్స్ రాకెట్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. పశ్చిమ బెంగాల్ లో ఈ డేరా బాబా శిష్యుడి నిర్వాకం బయటపడింది.
కోల్ కతాలోని బుర్రా బజార్ తన భవనాల్లోనే ప్రమోద్ సింఘానియా అనే అతను వేశ్య గృహాలను నడుపుతున్నాడు. ఈ విషయం ఒకింత ఆలస్యంగా స్థానికులకు తెలిసింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. శుక్రవారం దాడులు నిర్వహించారు. అయితే నిందితుడు మరో మైనర్ బాలికతో కలిసి రహస్య సొరంగం గుండా పారిపోయాడు. సొరంగం కనిపించకుండా నిర్మించిన చెక్క డోర్ పై దుస్తులు కప్పి ఉండదాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో మరికొందరు మైనర్ బాలురు - బాలికలను గుర్తించి అదుపులోకి తీసుకొన్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడిపై కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.
డేరాబాబా శిష్యుడైన ప్రమోద్ సింఘాని భవనంలోకి ఇటీవల కొందరు స్థానికులు వెళ్లగా...ఓ అంతస్థులో చెక్కలతో 25 క్యాబిన్లు నిర్మించి వాటిలో బెడ్ వేసి ఉంచినట్లు గుర్తించారు. అంతేకాకుండా...ఓ చెక్క క్యాబిన్ లో స్త్రీ-పురుష జంటలు అసభ్యకరమైన స్థితిలో ఉన్న విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడ వ్యభిచారం జరుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. పోలీసుల రాకను చూసిన ప్రమోద్ సింఘానియా ప్రత్యేక సొరంగ మార్గం గుండా తప్పించుకున్నాడు.