అలాంటి భ‌ర్త‌ల‌కు సుప్రీం సంచ‌ల‌న తీర్పు

Update: 2017-10-11 08:44 GMT
కొద్దిసేప‌టి క్రితం దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సంచ‌ల‌న తీర్పును వెలువ‌రించింది. మైన‌ర్ భార్య‌తో సంభోగం చేస్తే అత్యాచారం చేసిన‌ట్లేన‌ని తేల్చేసింది. ఇప్ప‌టివ‌ర‌కూ భ‌ర్త‌ల‌కున్న మిన‌హాయింపును ర‌ద్దు చేసిన సుప్రీం.. 18 సంవ‌త్స‌రాల కంటే త‌క్కువ వ‌య‌సున్న భార్య‌తో సంభోగం చేయ‌టం అత్యాచారం చేసిన‌ట్లే అవుతుంద‌ని స్ప‌ష్టం చేసింది.

ఐపీసీ సెక్ష‌న్ 375(20 మిన‌హాయింపును ర‌ద్దు చేస్తున్న‌ట్లుగా ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం తీర్పు ముందు వ‌ర‌కూ 18 సంవ‌త్స‌రాల కంటే త‌క్కువ వ‌య‌సున్న భార్య‌ల‌తో సంభోగం చేయ‌టానికి ర‌క్ష‌ణ క‌ల్పించేది. తాజాగా తీర్పుతో ఇంత‌కాలం ర‌క్ష‌ నిలిచిన  చ‌ట్టం.. ఇక‌పై శిక్ష విధించే వీలు క‌ల్పించిన‌ట్లైంది.

ఇప్ప‌టివ‌ర‌కూ ఉన్న మిన‌హాయింపు కార‌ణంగా మైన‌ర్ వ‌ధువుకు ఉండే ప్రాధ‌మిక హ‌క్కుల్ని ఉల్లంఘించేస్తుంద‌ని పేర్కొంది. భార్య వ‌య‌సు 15 నుంచి 18 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉన్న‌ప్పుడు.. భ‌ర్త ఆమెతో సంభోగం చేయ‌కూడ‌దు. ఒక‌వేళ చేసిన‌ట్లైయితే.. అత్యాచార నేరం కింద శిక్ష విధించాల్సి ఉంటుంది. అయితే.. ఈ నిబంధ‌న‌లు ఇప్ప‌టి నుంచి మాత్రమే అమ‌ల‌వుతుంది త‌ప్పించి.. ఈ తీర్పు గ‌తంలో దాఖ‌లైన కేసుల‌కు వ‌ర్తించ‌దు. సో.. మైన‌ర్ల‌ను పెళ్లాడే భ‌ర్త‌ల‌కు తాజా తీర్పు ముకుతాడు వేసే అవ‌కాశం ఉందని చెప్పాలి.
Tags:    

Similar News