హైదరాబాద్ లో ఘోరం.. ఆ పెద్ద స్కూల్లో నాలుగేళ్ల చిన్నారికి లైంగిక వేధింపులు

Update: 2022-10-19 00:44 GMT
నాలుగేళ్ల వయసు. అభం శుభం తెలియని పసిమొగ్గపై హైదరాబాద్ లోని ఒక ప్రముఖ విద్యా సంస్థలో చోటు చేసుకున్న దారుణం గురించి తెలిసినంతనే ఒళ్లు మండిపోవాల్సిందే. షాకింగ్ గా మారిన ఈ ఉదంతంలోకి వెళితే.. బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 14లోని బీఎస్ డీ డీఏవీ పబ్లిక్ స్కూల్ లో చదువుతున్న బాలిక దారుణ పరిస్థితుల్ని ఎదుర్కొంది. ఈ చిన్నారిని స్కూల్ ప్రిన్సిపల్ కారు డ్రైవర్ గా వ్యవహరిస్తున్న రజనీకుమార్ రెండు నెలలుగా వేధిస్తున్నాడు.

పాప ఆరోగ్యంలో మార్పులు రావటంతో పాటు.. స్కూల్ అంటేనే వణికిపోతున్న వైనాన్ని గుర్తించిన తల్లిదండ్రులు ఆ పాపను ఆరా తీయగా విషయం బయటకు వచ్చింది. దీంతో.. తీవ్ర ఆగ్రహానికి గురైన బాధితురాలి తల్లిదండ్రులు మంగళవారం సాయంత్రం స్కూల్ వద్దకు చేరుకున్నారు. రజనీ కుమార్ ను ప్రశ్నించారు.

దీనికి అతగాడి నుంచి వస్తున్న సమాధానంతో ఓపిక నశించిన వారు.. అతడికి దేహశుద్ధి చేశారు. అంత పేరున్న స్కూల్ లో పని చేసే కారు డ్రైవర్ ఇలా చేయటమా? అని అందరూ షాక్ తినే పరిస్థితి.

రెండు నెలలుగా వేధింపులకు గురి అవుతున్నా.. స్కూల్ సిబ్బంది గుర్తించకపోవటం గమనార్హం. రజనీకుమార్ తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన బాధితురాలి తల్లిదండ్రులు.. అతడ్ని కర్రతో చితక్కొట్టారు. చిన్న పిల్లను అలా ఎలా చేస్తావురా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కారు డ్రైవర్ ను చితక్కొట్టిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇదిలా ఉంటే.. ఈ ఉదంతంపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ షురూ చేశారు.  

చిన్నారిపై లైంగిక వేధింపులకు ప్రిన్సిపల్ మాధవి కూడా కారణమని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో కారు డ్రైవర్ ను.. ప్రిన్సిపల్ గా వ్యవహరిస్తున్న మాధవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News