ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అయినా.. మంత్రులు, ఎమ్మెల్యేలైనా ప్రభుత్వ వాహనాలు, పనులు చేయడానికి వీల్లేదు. అలా చేస్తే కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుంది.. కేసులు కూడా నమోదవుతుంటాయి. అలా ఎన్నికల వేళ ప్రభుత్వ బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాలు వాడిన కాంగ్రెస్ శాసనసభ, మండలి పక్ష నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీలు చిక్కుల్లో పడ్డారు. తాజాగా వారికి ఇంటెలిజెన్స్ పోలీసులు నోటీసులు ఇచ్చారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కోడ్ ఉండగా ప్రభుత్వం కేటాయించిన బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాలను వినియోగించారని.. దానికి గాను రోజువారి అద్దె, డ్రైవర్ భత్యం కింద రూ.9 లక్షలు చెల్లించాలని తాజాగా తెలంగాణ రాష్ట్ర ఇంటెలిజన్స్ సెక్యూరిటీ వింగ్ (ఐఎస్ డబ్ల్యూ) పోలీసులు జానారెడ్డితోపాటు షబ్బీర్ అలీకి నోటీసులు జారీ చేశారు. అయితే ఎన్నికల సమయంలో ప్రభుత్వం కేటాయించిన బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాలు వాడినవారందరికీ నోటీసులు పంపించినట్టు ఇంటెలిజన్స్ అధికారులు తెలిపారు. ఇందులో టీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.
సెప్టెంబర్ 6 నుంచి డిసెంబర్ 7వరకు బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాలు వాడినందుకు గాను జానారెడ్డి రూ.4.20 లక్షలు, షబ్బీర్ అలీ రూ.4.79 లక్షలు చెల్లించాలని స్పష్టం చేశారు. ఇద్దరు నేతలు కలిపి దాదాపు 9 లక్షలు చెల్లించాలని పేర్కొన్నారు. కాగా టీఆర్ఎస్ మంత్రులు, ఇతర వీఐపీలు కూడా బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాలు వాడారని ఇంటెలిజెన్స్ అధికారులు నోటీసులు ఇచ్చినట్టు సమాచారం. కానీ వారి పేర్లు మాత్రం అధికారికంగా వెల్లడించలేదు.
Full View