సొమ్ములు తెస్తారనుకుంటే ...

Update: 2015-05-09 18:32 GMT
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఢిల్లీ టూర్‌ నిరాశపరిచిందని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ వ్యాఖ్యానించారు. రైతు సమస్యలపై కేంద్రంతో చర్చించి నిధులు తెస్తారనుకుంటే.. సచివాలయం కోసం భూములు అడగడం ఆశ్చర్యమేసిందన్నారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకొంటుంటే సెక్రటేరియట్ కు కొత్త బిల్డింగ్ కావాలా అని షబ్బీర్ ఆలీ ప్రశ్నించారు. ప్రధానిని కేసీఆర్ కలువకుండా ఎంపీ కవిత కలవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.

 కేంద్రం తీసుకువస్తున్న భూసేకరణ బిల్లుకు టీఆర్ఎస్ మద్దతు ఇచ్చేందుకు సిద్ధమవడం వల్లే ఈ భేటీ జరిగిందని షబ్బీర్ అన్నారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు రాహుల్‌ యాత్రను తప్పుబట్టడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. రైతులను ఎవరు ఆదుకోవాలో కిషన్‌ రెడ్డి చెప్పాలని డిమాండ్‌ చేశారు.

టీఆర్‌ఎస్‌, బీజేపీ కుమ్మక్కు అయ్యారనే అనుమానం కలుగుతోందని పార్టీ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. రైతు ఆత్మహత్యలపై టీఆర్‌ఎస్‌ కేంద్రానికి తప్పుడు నివేదికలు ఇస్తే రాష్ట్ర బీజేపీ నేతలు దానిని సమర్థించడం దుర్మార్గమని శ్రావణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Tags:    

Similar News