తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎం అయిన నాటి నుంచి తెలంగాణ ప్రజలకు ఎన్నో హామీలు ఇస్తూనే ఉన్నారు. ముఖ్యంగా మైనార్టీలకు 5 శాతం రిజర్వేషన్లు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు మొదలుకుని ఎన్నో హామీలిస్తున్నారు. వాటిలో చాలా హామీలు అమలు కావడం లేదు. కేసీఆర్ అమలు కాని హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారంటూ తరచూ విమర్శించే తెలంగాణ కాంగ్రెస్ నేత, శాసననమండలి విపక్షనేత షబ్బీర్ ఆలీ మరోసారి ఆయనపై వ్యంగ్యాస్ర్తాలు సంధించారు.
తాను కేసీఆర్ ఆడుతున్న అబద్ధాలను లెక్కపెడుతున్నానని చెప్పారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన మొత్తం 180 అబద్ధాలు ఆడారని..వాటిని తాను జాగ్రత్తగా కౌంట్ చేసుకుంటున్నానని చెప్పారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేయడం...బంగారు తెలంగాణ... రైతుల ఆత్మహత్యలు లేకుండా చేస్తానని ఆయన చేసిన హామీలు ఎటుపోయాయని షబ్బీర్ ఎద్దేవా చేశారు.
కుటుంబ సమగ్ర సర్వే, మన ఊరు - మన ప్రణాళిక తాజాగా గ్రామజ్యోతి అంటు అర్భాటపు ప్రకటనలతో తెలంగాణ ప్రజలను కేసీఆర్ మభ్యపెడుతున్నారని..అసలు కేసీఆర్ కు తాను ఏం చేస్తున్నానో కూడా అవగాహనలేదని షబ్బీర్ విమర్శించారు. షబ్బీర్ చెప్పిన ఈ అబద్ధాల లెక్క బాగానే ఉన్నా..దీనికి తెరాస శ్రేణులు ఎలా స్పందిస్తాయో...షబ్బీర్ అబద్ధాల లెక్కలకు వాళ్లు ఎలాంటి నిజాల లెక్కలు చూపిస్తారో చూడాలి.