తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు చేయడంలో ముందుండే కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ మరోమారు తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే విద్యార్థులపై కక్ష పెంచుకున్నారనీ, ప్రత్యేకంగా ఓయూ విద్యార్థులపై కోపమున్నట్టుందని షబ్బీర్‌అలీ ఆరోపించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ ను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ ఫీజుదీక్ష నిర్వహించారు. ఈ దీక్షలను శాసనమండలి ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ - బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు - ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు కార్పొరేట్ విద్యాసంస్థలపై దండయాత్ర చేసిన టీఆర్ ఎస్ పార్టీ ఇపుడు దాన్ని పక్కనపెట్టేసిందన్నారు. కేసీఆర్ కూతురు కవిత - కేసీఆర్ మేనల్లుడు- రాష్ట్రమంత్రి హరీశ్ రావు ఇప్పుడు వారితో భాగస్వాములయ్యారని ఆరోపించారు.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ టీఆర్ ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ను చూసి తెలంగాణ ఇవ్వలేదని, విద్యార్థుల పోరాటాన్ని - ఉద్యమాన్ని చూసి ఇచ్చారని షబ్బీర్ అలీ తెలిపారు.ఇచ్చిన హామీలను బుట్టదాఖలు చేయటం - అబద్ధాలు ఆడటం విషయాల్లో కేసీఆర్‌యే నెంబర్ వన్ సీఎం అని విమర్శించారు. పది రోజుల్లో ఫీజు బకాయిలు విడుదల చేస్తామని అసెంబ్లీలో ప్రకటించారనీ, నేటికీ ఆ నిధులు విడుదల కాలేదని చెప్పారు. వాస్తుపేరుతో క్యాంపు కార్యాలయం - సచివాలయ నిర్మాణాలను కట్టడం ఆపి బంగారు తెలంగాణలో భాగస్వాములు కానున్న విద్యార్థులకు ఫీజురీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన రెండున్నర ఏళ్లలోనే రూ.74వేల కోట్ల అప్పు చేశారని విమర్శించారు. ఫీజుసమస్యను గవర్నర్ దృష్టికి తీసుకుపోతామన్నారు.
ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ... ఎస్సీ - ఎస్టీ - బీసీ - మైనార్టీలను కేవలం ఓటర్లుగా కేసీఆర్ చూస్తున్నారని అన్నారు. చదువుకోని చైతన్యవంతమైతే తన పదవికి ఎసరొస్తందని భయపడి విద్యార్థులు చదువుకోకుండా ఫీజులు విడుదల చేయడంలేదన్నారు. ఇప్పటివరకు విద్యార్థులు శాంతియుతంగానే ఆందోళనలు చేస్తున్నారనీ, వారు బరిశెలు పట్టుకునేంత వరకూ చూడొద్దని హెచ్చరించారు. రాష్ట్రంలో 18లక్షల మంది నిరుద్యోగులున్నారనీ, వారికి ఉద్యోగ - ఉపాధి అవకాశాలు కల్పించాలనీ డిమాండ్ చేశారు. ఫీజురీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ మాట్లాడుతూ.. స్వరాష్ట్రంలోనూ స్కాలర్ షిప్ లు - ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం దీక్షలు చేయడం విచారకరమన్నారు. రీయింబర్స్‌మెంట్ అనేది కళాశాలల సమస్య కాదని, విద్యార్థుల సమస్య అని గుర్తు చేశారు. కలిసికట్టుగా పోరాడితేనే సమస్య పరిష్కారమవుతుందని సూచించారు. ఓయూలో భవనాలు కూలిపోతున్నా పట్టించుకోని కేసీఆర్, వాస్తు పేరుతో ఉన్నవాటిని కూల్చి కొత్తగా క్యాంపు కార్యాలయం, సచివాలయాన్ని రూ.వందల కోట్లు పెట్టి నిర్మిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి వెంకట్ విమర్శించారు. ప్రతి ఏడాది రూ.లక్ష కోట్ల ఆదాయం వస్తుందని, దాన్ని విద్యా - ఉపాధి - సంక్షేమాలకు ఖర్చు చేయాలని కోరారు. ఎమ్మెల్యేల జీతాలు పెంచుకుంటున్నారు గానీ ఫీజులకు నిధులు మాత్రం ఇవ్వడం లేదని అన్నారు. రాష్ట్రంలోనూ శ్రీచైతన్య, నారాయణ కళాశాలలే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయని చెప్పారు. కేసీఆర్ 8వ నిజాంలా వ్యవహరిస్తున్నారని సీపీఐ రాష్ట్ర నాయకులు సుధాకర్ విమర్శించారు. అమరుల త్యాగాలతో వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని తనే తెచ్చినట్టు ప్రకటించుకోవడం సిగ్గుచేటని అన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/