తెలంగాణ సీఎం కేసీఆర్ పై మిగతా కాంగ్రెస్ నాయకులు నామమాత్రం - సందర్భానుసారం విమర్శలు చేస్తున్నప్పటికీ దూకుడుగా వెళ్లే కాంగ్రెస్ శాసనమండలి పక్షనేత షబ్బీర్ అలీ ఆసక్తికరమైన ప్రకటన చేశారు. ఈ దఫా ఆయన కేసీఆర్ ను నేరుగా కాకుండా పరోక్షంగా ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ చేసిన రాజకీయ తప్పులే ఆయనకు శాపంగా మారనున్నాయని షబ్బీర్ అలీ మండిపడ్డారు.
గాంధీభవన్ లో విలేకరులతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు - ఎంపీలను పార్టీ మార్పించడం ద్వారా ఫిరాయింపుల్లో రికార్డు సృష్టించిన ఘనత కేసీఆర్ కే దక్కిందని షబ్బీర్ అలీ విమర్శించారు. కేసీఆర్ తీరును ప్రజలంతా గమనిస్తున్నారని చెప్పారు. జంపింగ్‌లపై తమ పార్టీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు స్పీకర్ కు - పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఇప్పటికే నోటీసులు జారీ చేసిందని గుర్తు చేశారు. ఈ ఫిరాయింపుదారులపై అనర్హత వేటువేయడం ఖాయమని షబ్బీర్ అన్నారు. పార్టీ మారిన 25 మంది ఎమ్మెల్యేలు - ఎంపీ స్థానాలకు త్వరలో ఉపఎన్నికలు రాబోతున్నాయని ఆయన జోస్యం చెప్పారు. ఈ ఎన్నికల ద్వారా తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత స్పష్టం అవుతుందని షబ్బీర్ అలీ తెలిపారు.