తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ బాధ ఒక పట్టాన తీరేదిగా కనిపించటం లేదు. పదేళ్ల కాంగ్రెస్ హయాంలో తిరుగులేని నేతగా చెలామణీ అయి.. ఒక వెలుగు వెలిగిన ఆయన.. తాజా పరిస్థితికి విపరీతమైన వేదన చెందుతున్నారు. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా పాతబస్తీకి వెళ్లిన తమను.. కారులో నుంచి బయటకు లాగి మరీ కొట్టేసిన తీరుతో ఆయన తీవ్ర మనస్తాపం చెందుతున్నారు.
ఒకవైపు ఇదో బాధగా ఉంటే.. కారులో నుంచి దిగని తమపై.. తిట్టారని.. అనరాని మాటలు అన్నారంటూ ఎదురు కేసులు నమోదు చేయటంపై ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘మమ్మల్ని కొట్టి మా మీదనే కేసులా?’’ అని సూటిగా అడుగుతున్నారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందన్న విషయం మీద తనకు నమ్మకం ఉందని.. తమపై దాడి చేసిన వారికి చట్టప్రకారం చర్యలు తీసుకుంటారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేయటం గమనార్హం.
ఏది ఏమైనా తమ మీద దాడి చేసిన వారిపై సరైన చర్యలు తీసుకోలోదన్న బాధ.. తమపై ఆ స్థాయిలో దాడి జరిగినా స్పందన లేదన్న ఆవేదనతో పాటు.. తమనుకొట్టి తమ మీదనే తిరిగి కేసులు పెట్టటం లాంటి వరుస ఘటనలతో షబ్బీర్ తీవ్ర మనస్తాపం చెందినట్లుగా చెబుతున్నారు. కొన్నిసార్లు కాలం తమకు అనుకూలంగా ఉండదన్న విషయం షబ్బీర్ లాంటోళ్లకు తెలియంది కాదు.