మాటల్ని మంచిగా వాడితే.. ఆ మనిషిని అభిమానించి ఆరాధిస్తుంటారు. కానీ.. ఊరంతా ఒక దారి అయితే.. ఉలిపిరికట్టది మరో దారి అన్నట్లుగా అందరూ ఓకే అంటున్న దాన్ని విభేదించటం.. ఇష్టారాజ్యంగా వ్యవహరించటం.. పిడివాదనను వినిపిస్తూ మూర్ఖత్వానికి పరాకాష్ఠగా వ్యవహరిస్తున్న ఒక ఇమామ్‌కు భారీ షాకే తగిలింది.
గతంలో ప్రధాని మోడీ దగ్గర నుంచి వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా ఇష్టారాజ్యంగా ఫత్వాలు జారీ చేసే అలవాటున్న సదరు ఇమామ్‌కు భారీ షాక్ తగిలింది. ఇంతకీ.. ఆ ఇమామ్ ఎవరంటారా... టిప్పు సుల్తాన్ మసీదు షాహీ ఇమామ్ మైలానా నూరుర్ రెహ్మాన్ బర్కతి. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం ఒక అలవాటు. తాజాగా ఎర్రబుగ్గల విషయంలోనూ ఇష్టారాజ్యంగా మాట్లాడిన ఇతడి తీరు వివాదాస్పదంగా మారింది.
ఎర్రబుగ్గల్ని నిషేధిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేస్తే.. ఇతగాడు మాత్రం వాటిని లైట్ తీసుకొని తన ఎర్రబుగ్గను తీయలేదు. ఇదేంటని ప్రశ్నించిన మీడియాను.. తన కారు మీదున్న ఎర్రబుగ్గను తీసే దమ్ము ఎవరికీ లేదంటూ నోరుపారేసుకున్నారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఈ ఇమామ్ ను కంట్రోల్ చేయటానికి టిప్పు సుల్తాన్ మసీదు ట్రస్టీల సమావేశం జరిగింది. దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయటంతో పాటు..రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్న ఇతడ్ని పదవి నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నోరు పారేసుకున్న బర్కతికి ఇప్పుడున్న పదవి పోయింది. నోటి మాట ఎంత పని చేసిందో కదూ!