ఇండియాకు పాకిస్థాన్ కి మధ్య ఉన్న తాజా పరిస్థితుల గురించి అందరికీ తెలిసిన విషయమే. దానికి కారణం కూడా పాక్ వంకరబుద్దే అనేది ప్రతీభారతీయుడికీ తెలిసిన సంగతే. ఈ విషయంలో పాకిస్థాన్ పేరు చెబితేనే అంతెత్తున లేచే పరిస్థితి భారత్ అంతా నెలకొని ఉంది. ఉడీ ఉగ్ర సంఘటన, సర్జికల్ స్ట్రైక్స్ అనంతరం ఇరు దేశాల మధ్య పచ్చగడ్డివేస్తే బగ్గుమనే పరిస్థితి. ఈ సమయంలో కూడా పాకిస్థాన్ క్రికెటర్ పై అభిమానం అంటూ ఒక వ్యక్తి చేసిన పనికి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
విషయానికొస్తే... అసోంలోని హైలకాండి జిల్లాలో జరిగిన ఒక స్థానిక క్రికెట్ మ్యాచ్ కు రిపున్ చౌదరీ అనే వ్యక్తి పాకిస్థాన్ జెర్సీ (టీషర్ట్) ధరించి వచ్చాడు. అతను పాకిస్థాన్ వెటరన్ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రీది అభిమాని కావడం వల్ల అతడి పేరునున్న జెర్సీని ధరించాడట. విషయం తెలుసుకున్న భారతీయ యువ మోర్చా కమిటీ సభ్యులు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతణ్ణి అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
గతంలో కూడా పాకిస్థాన్ లో ఇలాంటి సంఘటనే జరిగింది. విరాట్ కోహ్లీని అభిమానించే ఉమెర్ డరాజ్ అనే ఒక పాకిస్థాన్ వ్యక్తి తన ఇంటిపై భారత త్రివర్ణ పతాకం ఎగరవేయడంతో దేశద్రోహం నేరం కింద అతడికి పదేళ్ల జైలు శిక్ష విధించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/