ఎంతోమంది కెరీర్ల‌ను నాశ‌నం చేశాడ‌ట‌!

Update: 2019-05-08 05:03 GMT
త‌న బ‌యోగ్ర‌ఫీ పుస్త‌కంతో ప‌లువురి మీద పెద్ద ఎత్తున ఆరోప‌ణలు చేసిన పాక్ స్టార్ ఆల్ రౌండ‌ర్ షాహిద్ అఫ్రీదీ గ‌డిచిన కొద్దిరోజులుగా వివాదాల‌తో స‌హ‌వాసం చేస్తున్నాడు. పాక్ క్రీడాకారుల‌తో పాటు.. భార‌త్ కు చెందిన ప‌లువురు క్రికెట‌ర్ల మీద ఆయ‌న దారుణ ఆరోప‌ణ‌లు చేశారు.

క‌శ్మీర్ అంశంతో పాటు 2010 స్పాట్ ఫిక్సింగ్ తో పాటు.. త‌న వ‌య‌సుకు సంబంధించిన వివాదాస్ప‌ద అంశాల్ని తాజాగా ఆయ‌న బ‌య‌ట‌పెట్టారు. ఇదిలా ఉంటే.. అఫ్రీదీ తీరును ఇప్ప‌టికే ప‌లువురు త‌ప్పు ప‌ట్టారు.తాజాగా పాక్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఫ‌ర్హాత్ ఆరోపించారు. గేమ్ చేంజ‌ర్ పేరుతో త‌న బ‌యోగ్ర‌ఫీని వెల్ల‌డించిన ఆయ‌న‌.. పాక్ క్రికెట‌ర్లు జావెద్ మియాందాద్.. వ‌కార్ యూనిస్ తో పాటు భార‌త మాజీ క్రికెట‌ర్ గౌత‌మ్ గంభీర్ లాంటి ప‌లువురు క్రికెట‌ర్ల మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఈ నేప‌థ్యంలో రంగంలోకి దిగిన పాక్ మాజీ క్రికెట‌ర్ వ్యాఖ్యానిస్తూ.. ఆప్రిదీ స్వార్థ‌పూరిత ఆట‌గాడుగా అభివ‌ర్ణించారు. త‌న బాగు కోసం ఎంతోమంది ఆట‌గాళ్ల జీవితాల్ని నాశ‌నం చేసిన‌ట్లుగా ఆరోపించారు. త‌న వ‌య‌సు విష‌యంలో 20 ఏళ్ల పాటు అబద్ధం చెప్పాడ‌ని.. అలాంటి వ్య‌క్తి ప్ర‌ముఖ క్రికెట‌ర్ల‌ను నిందించ‌టం స‌రికాద‌న్నారు.

ఆప్రిదీ ఆటోబ‌యోగ్ర‌ఫీలో విష‌యాలు చ‌దివి చాలానే తెలుసుకున్నా.. అందుకు నాకు చాలా సిగ్గుగా ఉంద‌న్నాడు. 20 ఏళ్ల పాటు త‌న వ‌యసుని దాచి పెట్టి.. ఇప్పుడు మంచోడిగా ఇత‌రుల్ని నిందిస్తున్నాడ‌న్నారు. రాజ‌కీయ నాయ‌కుడు అయ్యేందుకు ఆఫ్రిదీకి మంచి నైపుణ్యం ఉంది. అత‌డి చేతిలో మోస‌పోయిన చాలామంది ఆట‌గాళ్లు బ‌య‌ట‌కొచ్చి త‌మ‌కు జ‌రిగిన అన్యాయాన్ని వెల్ల‌డించాల‌ని పిలుపునిచ్చాడు. త‌న స్వార్థం కోసం ఎంతోమంది కెరీర్ ల‌ను నాశ‌నం చేశాడంటూ వ‌రుస ట్వీట్లు చేశాడు. సొంత క్రికెట‌ర్లు తిట్టిపోస్తున్న తీరు చూస్తే.. సొంత దేశంలో సొంత మ‌నుషుల మ‌ధ్య ఆయ‌న‌కున్న ప‌ర‌ప‌తి ఎంత‌న్న‌ది ఇట్టే అర్థం కాక మాన‌దు.




Tags:    

Similar News