'ప‌ఠాన్' అనే దేశ భ‌క్తి చిత్రంపై ఈ దాడులేంటి?

Update: 2022-12-20 01:30 GMT
గ‌త రెండు ...మూడు రోజులుగా `ప‌ఠాన్` ఏ రేంజ్ లో నెట్టింట వైరల్ అవుతుందో చెప్పాల్సిన ప‌నిలేదు. బేష‌రామ్ సాంగ్లో దీపికా ప‌దుకొణే అందాలు ఆర‌బోయ‌డం....కాషాయ రంగు బికినీ ధ‌రించ‌డంతో భాజాపా నేతలు ఒక్క‌సారిగా భ‌గ్గుమ‌న్నారు. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో నెటి జ‌నులు సైతం బ్యాన్ ప‌ఠాన్ అంటూ నినాదం తీసుకొచ్చారు. ప‌బ్లిక్ రోడ్ పై  షారుక్ దిష్టిబొమ్మ‌ని ద‌హ‌నం చేసి స‌న్నివేశం మ‌రింత హీటెక్కెలా చేసారు.

ఇది ఇక్క‌డితో అయిపోలేదు. ఆ త‌ర్వాత అమితాబ‌చ్చ‌న్ ప‌రోక్షంగా పఠాన్ కి మ‌ద్ద‌తుగా నిల‌వ‌డం..విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్  సైతం సీన్ లోకి వ‌చ్చి దీపిక‌కి మ‌ద్ద‌తివ్వ‌డం... ఈ దాడులేంటి? అన్న త‌ర‌హాలో ప్ర‌శ్నించ‌డం వంటివి వాతావ‌ర‌ణాన్నిమ‌రింత వెడెక్కించాయి. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో షారుక్ ఖాన్ సోష‌ల్ మీడియాలో చిట్ చాట్ లో పాల్గొన్నాడు.

అందులో  ఓ నెటి జ‌నుడు మీరు మంచి దేశ భ‌క్తి నేప‌థ్య‌మున్న సినిమా చేయోచ్చు క‌దా? అని స‌ల‌హా ఇచ్చాడు. దీనికి షారుక్ మ‌రో ఆలోచ‌న లేకుండా `ప‌ఠాన్` దేశ‌భ‌క్తి సినిమా నే..కాక‌పోతే ఇందులో యాక్ష‌న్ ఎక్కువ‌గా ఉంటుంది. దాన్ని చూసి త‌ట్టుకునే శ‌క్తి మ‌న‌కి ఉండాలి అన్న తీరులో స్పందించారు. దీంతో షారుక్ వ్యాఖ్య‌లు మ‌రోసారి నెట్టింట వైర‌ల్ గా మారాయి.

నిజంగా ఇది దేశ‌భ‌క్తి నేప‌థ్యం గ‌ల సినిమా అయితే ప‌ర్వాలేదు. లేదంటే?  ప‌ఠాన్ రిలీజ్ త‌ర్వాత చాలా పెద్ద ఎత్తున విమర్శ‌లు ఎదుర్కోవాల్సి  ఉంటుంది. నేడు మాట్లాడిన ప్ర‌తీ మాట భాజాపాకి  కౌంట‌ర్ గా ప‌డిన‌ట్లే. వాటికి స‌మాధానం రిలీజ్ త‌ర్వాత షారుక్ చెప్పాల్సి  ఉంటుంది. ఒక‌వేళ నిజ‌మైన‌ దేశ‌భ‌క్తి సినిమా అయితే భాజాపా కూడా త‌గ్గాల్సిన స‌న్నివేశం ఉంటుంది.

దేశ భ‌క్తి నేప‌థ్యంగ‌ల సినిమాపై దాడులేంటి అంటూ!  షారుక్ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో కొంత మంది ఇప్ప‌టికే బాస‌ట‌గా  నిలుస్తున్నారు.  దేశ‌భ‌క్తి అంటే? త‌మ‌దే అన్న తీరున ఆ పార్టీ పై ప్ర‌తి ప‌క్షాలు యాగీ చేయ‌డం స‌హ‌జ‌మే.  రాజ‌కీయాల నేప‌థ్యంలో ఇవ‌న్నీ స‌హ‌జ‌మే. అయితే  సినిమా న‌టుడు షారుక్ వ్యాఖ్యానించ‌డం జ‌నాల్లోకి మ‌రోలా వెళ్లే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే  ఓ సెక్షన్ ఆడియ‌న్స్ షారుక్ సినిమాల్ని బ్యాన్ చేయాలంటూ నిన‌దించిన సంగ‌తి  తెలిసిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News