షారుఖ్ ఖాన్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు..

Update: 2022-09-27 07:28 GMT
దేశంలోనే పేరున్న హీరోలు బయటకు వస్తే ఏమన్నా ఉంటుందా? అక్కడ తొక్కిసలాటలు.. తోపులాటలు సహజం. ఆ హీరోను చూడాలని.. ఫొటోలు దిగాలని.. సెల్ఫీలు, ఆటో గ్రాఫ్ ల కోసం మీదపడుతారు.అయితే అది హీరోల తప్పు కాదు. జనం అభిమానం అంతే. అయితే ఆ హీరోల వల్ల ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు.. తాజాగా షారుఖ్ ఖాన్ ను కూడా ఇలాంటి ఓ కేసు చాలా కాలంగా వెంటాడుతోంది.

గుజరాత్ లోని వడోదరలో 2017లో 'రాయిస్' చిత్ర ప్రమోషన్ లో భాగంగా తన చిత్ర బృందంతో కలిసి ముంబై నుంచి ఢిల్లీకి రైలులో వెళ్లారు. మార్గమాధ్యంలో వడోదర రైల్వే స్టేషన్ లో ఆయన్ను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు.

అయితే గుమిగూడిన జనంపై ఆయన టీషర్టులు, స్మైలీ బాల్స్ విసిరాడు. ఇది తొక్కిసలాటకు దారితీసింది. షారుఖ్ ఖాన్ వల్లే తొక్కిసలాట జరిగిందని ఆరోపిస్తూ ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జితేంద్ర మధుభాయ్ సోలంకి అనే వ్యక్తి వడోదర కోర్టులో ఫిర్యాదు చేశారు. దాన్ని కొట్టేయాలని కోరుతూ షారుఖ్ ఖాన్ గతంలో గుజరాత్ హైకోర్టును ఆశ్రయించాడు.

ఈ ఏడాది ఏప్రిల్ లో ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఫిర్యాదుదారుడు దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయగా.. తాజాగా షారుఖ్ కు మరోసారి ఊరట లభించింది.

షారుఖ్ ఖాన్ కు సుప్రీంకోర్టులో ఈ వడోదర తొక్కిసలాట కేసులో భారీ ఊరట దక్కింది. ఈ వ్యవహారంపై ఆయనపై నమోదైన క్రిమినల్ కేసులు కొట్టేయాలంటూ గుజరాత్ హైకోర్టు గతంలో జారీ చేసిన ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్థించింది.

హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. దాఖలైన పిటీషన్ పై జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ సిటీ రవికుమార్ లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే గుజరాత్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News