'సాకే' వారూ.. 'కాక' పెడుతున్నారే!

Update: 2022-12-30 05:01 GMT
అవును.. ఇప్పుడు ఏపీ రాజ‌కీయ నేత‌ల చ‌ర్చ‌ల మ‌ధ్య ఈ విషయం ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఏమీ లేని కాంగ్రెస్‌ను ఏదో విధంగా ముందుకు తీసుకువెళ్లాల‌ని వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పార్టీని అభివృద్ది చేయాల‌ని.. కాంగ్రెస్‌ నిర్ణ‌యించుకుంది. జ‌రిగిందేదో జ‌రిగిపోయింద‌ని.. పేర్కొంటూ ఏపీ ప్ర‌జ‌ల‌ను మ‌చ్చిక చేసుకునే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తోంది. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌.. సాకే శైల‌జానాథ్‌ను ప‌క్క‌న‌పెట్టింది.

ఈ క్ర‌మంలోనే గిడుగు రుద్రరాజు కు ప‌గ్గాలు అప్ప‌గించింది అధిష్టానం. దీంతో ఛార్జ్ తీసుకున్న తొలి రోజే.. గిడుగు అద్భుత‌మైన మాట మాట్లాడారు. ఘ‌ర‌వాప‌సీ ప‌పిలుపునిస్తున్నాన‌ని చెప్పారు. వెళ్లిపోయిన వారం తా వ‌చ్చేయాల‌ని.. పార్టీని ప‌ట్టుబ‌ట్టి గ‌ట్టెక్కించేందుకు కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు. దీంతో ఇంకే ముంది.. పార్టీ పుంజుకుంటుందేమో.. అని కాంగ్రెస్ అభిమానులు భావించారు.

కానీ, అనూహ్యంగా పార్టీ ముందుకు సాగ‌డం మాట అటుంచితే.. నిన్న గాక మొన్న‌టి వ‌ర‌కు పార్టీకి చీఫ్‌గా ఉన్న కాంగ్రెస్ నేత‌, మాజీ మ్ంత్రి  సాకే శైల‌జానాథ్ కాంగ్రెస్ పార్టీ గురించికాక పుట్టించే కామెంట్లు చేశారు. ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలోని శింగ‌న‌మ‌ల నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన సాకే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ఇక్క‌డ నుంచి పోటీచేస్తాన‌ని చెప్పారు. దీనిని ఎవ‌రూ కాద‌న‌రు.

అయితే.. ఇక్క‌డే ఒక సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. "వ‌చ్చే ఎన్నిక‌ల్లో శింగ‌న‌మ‌ల నుంచి పోటీ ఖాయం. గెలు స్తానా?  లేదా..అనేది ప‌క్క‌న పెడితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తా. అయితే.. ఏ పార్టీ అనేది మూడు మాసాల్లో చెబుతా!" అని సాకే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నిజానికి ఒక‌వైపు.. పార్టీని డెవ‌ల‌ప్ చేసేందుకు కాంగ్రెస్ ప్ర‌య‌త్నిస్తుంటే.. ప‌ద‌వులు అనుభ‌వించిన నాయ‌కులు మాత్రం పార్టీ కాపాడే స‌మ‌యం వ‌స్తే.. ప‌క్క‌కు త‌ప్పుకొంటుండ‌డం గ‌మ‌నార్హం.గ‌తంలో ర‌ఘువీరారెడ్డి కూడా ఇలానే చేశార‌ని.. అంటున్నారు ప‌రిశీల‌కులు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News