హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు వచ్చేటంతటి ఆదాయం దేశంలో ఇంకే నగరంలోని ట్రాఫిక్ పోలీసులకూ రాదంటారు. పార్కింగ్ ప్లేసులు సరిగా ఉండవు.. రోడ్లు సరిగ్గా ఉండవు.. ఏది వన్ వే ట్రాఫిక్ రోడ్డో... ఏ రూట్లో ఏ వాహనాలు వెళ్లరాదో సరిగా చెప్పే బోర్డులు ఉండవు.. జామ్ అయితే క్లియర్ చేసే నాథుడే ఉండడు.. కానీ, పొరపాటున ఎక్కడైనా రోడ్డు పక్కన చిన్న స్కూటీ నిలిపినా కూడా ట్రాఫిక్ పోలీసులు ఫొటో తీసి చలానా ఇష్యూ చేసేస్తారు. ట్రాఫిక్ నిబంధనలు మంచివే అయినా... ఆ నిబంధనలు అందరికీ వర్తిస్తేనే దాని అసలు లక్ష్యం నెరవేరుతుంది. కానీ.. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మాత్రం సామాన్యులపై ఒత్తిడి పెంచినట్లుగా పెద్దలతో మాత్రం వ్యవహరించరు. ఈ విషయాన్నే ఓ యువకుడు తాజాగా ప్రశ్నించాడు. సోషల్ మీడియాలో ఆధారాలు సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
పెండింగ్ చాలన్లపై నోటీసులు పంపిస్తూ వాహనదారులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. దీంతో మోహిత్ పటేల్ అనే ఓ యువకుడు... హైదరాబాద్ లో ట్రాఫిక్ ఉల్లంఘన నిబంధనలు సామాన్యులకేనా...ట్రాఫిక్ నిబంధనలు ఉన్నత అధికారులకు వర్తించావా అంటూ హైదరాబాద్ నగర కమిషనర్ దాన కిశోర్ వాహనంపై ఉన్న పెండింగ్ చలాన్లపై ట్విటర్లో ప్రశ్నించాడు. పేరుకు పెద్ద ఎత్తున ప్రజలకు అవగాహాన కల్పిస్తున్న పోలీసులు ప్రభుత్వ ఉన్నతాధికారుల విషయంలో మాత్రం చూసిచూడనట్టు వ్యవహరిస్తున్నారంటూ సోషల్ మీడియాలో పోస్టును పెట్టాడు. దీంతో ఆ అధికారి తన పెండింగ్ చలాన్లన్నీ చెల్లించేశారు.
కమిషనర్ వాహనంపై రూ. 6210 పెండింగ్ చలాన్లు ఉన్నాయని... ఇవన్నీ ఓవర్ స్పీడుతో వెళ్లారని విధించనేవని మోహిత్ ఆ పోస్టులో తెలిపాడు. ప్రజల కంటే ముందుగా అధికారుల్లో అవగాహాన కల్పించాలని పోలీసులను కోరారు. కాగా టీఎస్09 ఎఫ్ ఏ 4248 అనే నంబర్ పై రాజెంద్రనగర్ లోని పలు ప్రాంతాల్లో కమిషనర్ వాహానానంపై ఆగస్టు 2018 నుండి ఏప్రిల్ 30 - 2019 మధ్య కాలంలో ఉన్న పెండింగ్ చలాన్లు ఉన్నాయి. మెహిత్ పటేల్ తన ట్విట్ లో రాచకోండ సీపీ మహెష్ భగవత్ - హైదారాబాద్ - సైబారాబాద్ ట్రాఫిక్ పోలీసులతోపాటు టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ట్యాగ్ చేశాడు. ఈ ట్వీట్ సంచలనం కావడంతో దాన కిశోర్ వెంటనే ఆ మొత్తాన్ని చెల్లించేశారు.