వృత్తి రీత్యా మోడల్.. టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ సతీమణిగా సుపరిచితురాలు.. ఇటీవల కాలంలో భర్తతో ఏర్పడిన విభేదాల కారణంగా తరచూ వార్తల్లో దర్శనమిచ్చిన హసీన్ జహాన్ తాజాగా పొలిటికల్ జర్నీ షురూ చేశారు. తాజాగా ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి వార్తల్లోకి వచ్చారు.
ముంబయి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంజయ్ నిరుపమ్ సమక్షంలో ఆమె పార్టీలో చేరారు. వృత్తి రీత్యా మోడల్ అయిన ఆమె.. తాజాగా బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వనున్నారు.తన భర్త వేధింపులకు గురి చేస్తున్నాడంటూ ఆరోపణలు చేయటమే కాదు.. షమీ కుటుంబ సభ్యుల మీద వేధింపుల ఫిర్యాదు చేయటం ద్వారా సంచలనానికి తెర తీసింది.
అంతేకాదు.. షమీ మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాడంటూ సంచలన వ్యాఖ్యలు చేయటం ద్వారా.. అతడికి టీమిండియాలో స్థానం లేకుండా చేశారని చెప్పక తప్పదు. తర్వాతి కాలంలో మళ్లీ టీమిండియాలో చోటు సంపాదించిన షమీ.. తన భార్య కారణంగా చాలానే కష్టాల్ని అనుభవించాడు. ఇలాంటి వేళ.. షమీ సతీమణి మరోసారి వార్తల్లోకి వస్తూ పొలిటికల్ జర్నీ షురూ చేయటం ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు