ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ ది సహజ మరణమేనని థాయ్ లాండ్ పోలీసులు ధృవీకరించిన సంగతి తెలిసిందే. అయితే, వారు ఆ ప్రకటన ఇచ్చిన తర్వాత వార్న్ విల్లాలోని ఓ సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. వార్న్ చనిపోవడానికి నాలుగు గంటల ముందు అతడి రూంలోకి నలుగురు అమ్మాయిలు వచ్చి వెళ్లడం ఆ ఫుటేజ్ లో రికార్డయింది. దీంతో, వార్న్ మరణానికి, ఆ అమ్మాయిలకు ఏమైనా సంబంధం ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వార్న్ ను చివరిసారిగా చూసింది ఆ నలుగురేనని స్థానిక పోలీసులు ధృవీకరించారు. అయితే, వార్న్ మరణానికి ఆ అమ్మాయిలకు సంబంధం లేదని వారు వెల్లడించారు. వార్న్ చనిపోయిన రోజు మధ్యాహ్నం 1: 53 గంటల సమయంలో అతడికి ఆ నలుగురు మసాజ్ చేసేందుకు వచ్చారని తెలిపారు.
వారిలో ఇద్దరు వార్న్ స్నేహితుల రూంలోకి వెళ్లగా మరో ఇద్దరు వార్న్‌తో గంటకు పైగా గడిపారని చెప్పారు. ఆ తర్వాత ఆ నలుగురమ్మాయిలు తిరిగి 2: 58 గంటల సమయంలో రూం నుంచి వెళ్లిపోయారని సీసీ కెమెరాల్లో రికార్డయిందని తెలిపారు. ఈ కేసులో వార్న్ స్నేహితులకు గాని, మసాజ్ చేసిన అమ్మాయిలకుగాని ఎటువంటి సంబంధం లేదని తేల్చారు. అకస్మాత్తుగా వచ్చిన గుండెపోటు కారణంగానే వార్న్ మరణించాడని నిర్ధారించారు.
మరోవైపు, వార్న్ భౌతికకాయాన్ని బ్యాంకాక్ ఎయిర్‌పోర్టు నుంచి ఆస్ట్రేలియాకు వార్న్ మృతదేహాన్ని గురువారం సాయంత్రం తరలించారు. వార్న్ అంత్యక్రియలు మార్చి 30న ప్రభుత్వ అధికార లాంచనాలతో నిర్వహించనున్నట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది.
ఈ నెల 30న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) లో వార్న్ అంత్యక్రియలు జరగనున్నాయి. వార్న్ కు ఎంతో అచ్చొచ్చిన ఎంసీజీ గ్రౌండ్ లోనే అతడికి అభిమానులు వీడ్కోలు పలికేందుకు ఈ ఏర్పాట్లు చేశారు. వార్న్ అంత్యక్రియలలో లక్షమంది వరకు పాల్గొంటారని అంచనా.