రాజకీయాలు పోటాపోటీగా మారినప్పుడు.. వ్యక్తిగత కక్ష స్థాయికి దిగజారినప్పుడు.. అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి. తాజాగా వ్యవహారం చూస్తే ఇలాంటిదేనని చెప్పక తప్పదు. తెలంగాణ అధికారపక్షానికి ప్రధమ ప్రత్యర్థి అయినా టీటీడీపీ నేత రేవంత్ రెడ్డికి సంబంధించిన ఒక వ్యవహారం తెలంగాణ సర్కారుకు కాస్తంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది.
గత సార్వత్రిక ఎన్నికల్లో శేరిలింగంపల్లి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన శంకర్ గౌడ్.. తాజాగా తన అనుచరులతో కలిసి.. టీటీడీపీ నేత రేవంత్ రెడ్డికి చెందిన ఒక స్థలం ప్రహరీగోడను కూల్చటం వివాదస్పదంగా మారింది.
రంగారెడ్డి జిల్లా గోపన్న పల్లిలో రేవంత్ రెడ్డికి స్థలం ఉంది. దానికి ప్రహరీగోడ ఉంది. అయితే.. శంకర్ గౌడ్ అనుచరులు రేవంత్ రెడ్డికి చెందిన స్థలం ప్రహరీ గోడను కూల్చే ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న రేవంత్ రెడ్డి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు.. శంకర్ గౌడ్ అనుచరుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి చర్యలు ప్రభుత్వానికి సంబంధం లేకున్నా.. ప్రభుత్వ నేతల సహకారంతోనే ఇలాంటి చోటు చేసుకుంటున్నాయని.. రాజకీయ శత్రుత్వంతోనే ఇలాంటి చేస్తున్నారంటూ విమర్శలు చేసే అవకాశం ఉంది. ఇలాంటి వాటి విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేకున్నా.. అపవాదు మోయాల్సిన ప్రమాదం ఉంటుంది. అందుకే.. ఇలాంటి వాటి విషయంలో ప్రభుత్వం కరుకుగా వ్యవహరిస్తే మంచిది.