పెద్దనోట్ల రద్దుపై దేశమంతా స్పందిస్తున్న రీతిలోనే ఇపుడు స్వామీజీలు సైతం వచ్చి చేరారు. పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని జగద్గురు కాశీ సురేము పీఠాధిపతి శంకరాచార్య స్వామి నరేంద్రానంద్ సరస్వతి స్వాగతించారు. మనోరమనగర్ లోని సిద్ధేశ్వర ఆలయంలో జరుగుతున్న 45రోజుల యజ్ఞ కార్యక్రమాల్లో భాగంగా ఆయన భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. పార్లమెంటులో సభ కార్యకలాపాలను కొందరు ఎంపీలు అడ్డుకోవడంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశా రు. అలాంటి ఎంపీలను పార్లమెంటు నుంచి బయటకు పంపించడానికి మార్షల్స్ ను ఎందుకు వినియోగించడం లేదని ప్రశ్నించారు. జీతాలు - అలవెన్సులు తీసుకుని మరీ సభకొచ్చి కార్యక్రమాలకు అంతరాయం కల్పిస్తున్నారని ఆయన విపక్షాలపై ధ్వజమెత్తారు. సభలో గొడవ చేసేవారికి జీతాలు ఇవ్వొద్దని ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు.
ఇదిలాఉండగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మరోసారి నోట్ల రద్దు విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఫైర్ అయ్యారు. అనాలోచితంగా తీసుకొన్న నోట్లరద్దు నిర్ణయానికి ఇంకా ఎంతమంది ప్రాణాలు పోవాలని కోరుకొంటున్నారని ప్రశ్నించారు. మోదీ బాబు కోసం ఈ దేశంలో ఇంకా ఎంతమంది చావాలి అని సోమవారం ఆమె ట్వీట్ చేశారు. ఆ పార్టీ సీనియర్ నేత డెరెక్ ఓ బ్రయన్ దానిని రీ ట్వీట్ చేశారు. కాగా, బెంగాల్ కు చెందిన కొంతమంది పాత్రికేయుల బ్యాంకు అకౌంట్ల వివరాలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షం కావడం కలకలం రేపింది. ఈ విషయంపై మమతాబెనర్జీ స్పందిస్తూ.. దేశం డిజిటల్ కావాలని మోదీ ప్రభుత్వం కోరుతున్నా, ఈ తరహా చర్యలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని ఆందోళన చెందారు. నగదురహిత లావాదేవీలకు భద్రత ఎంతవరకు ఉన్నదన్న విషయం చర్చించాల్సి ఉన్నదని ట్వీట్లు చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/