రాజకీయాల్లో ఆరితేరిన కేసీఆర్ మరోసారి వ్యూహాత్మకంగా బీజేపీకి చెక్ పెట్టారు. హుజూర్ నగర్ లో తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మని దించి గులాబీ పార్టీని ఇరుకునపెట్టాలని బీజేపీ శతవిధాలా ప్రయత్నాలు చేసింది. టీఆర్ ఎస్ లో ఆమెకు గుర్తింపు లేదని.. ఉద్యమకారుడి తల్లిని పట్టించుకోవడం లేదంటూ సెంటిమెంట్ రాజేసే ప్రయత్నిం చేసింది. శంకరమ్మకే బీజేపీ టికెట్ దాదాపు ఖాయం అని ప్రచారం చేసింది.
కేసీఆర్ ఇక్కడే చక్రం తిప్పారు. వెంటనే టీఆర్ ఎస్ పెద్దలు రంగంలోకి దిగి ఆమెకు నామినేటెడ్ పోస్టు హామీతోపాటు హుజూర్ నగర్ టీఆర్ ఎస్ అభ్యర్థి సైదిరెడ్డితో ఆర్థిక అండదండలు కూడా అందజేసినట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో బీజేపీలోకి వెళ్లి పోటీచేద్దామని భావించిన శంకరమ్మ ఆ ప్రతిపాదనను విరమించుకొని టీఆర్ ఎస్ లోనే కొనసాగుతానని చెప్పడం కొసమెరుపు.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ్ పై టీఆర్ ఎస్ అభ్యర్థిగా శంకరమ్మను నిలబెట్టారు. అప్పుడు ఆమె ఓడిపోయారు. ఆ తర్వాత 2018లో టికెట్ ను ఇవ్వలేదు గులాబీ అధిష్టానం.. సైదిరెడ్డిని నిలబెట్టింది. సైదిరెడ్డి కూడా స్వల్ప తేడాతో ఓడిపోయాడు. ఇప్పుడు మళ్లీ ఉప ఎన్నికల్లో శంకరమ్మ తనకే టికెట్ అంటూ గళం విప్పింది. కానీ ఈసారి కూడా కేసీఆర్ స్పష్టమైన హామీతోపాటు ఆమెకు భరోసా కల్పించడంతో బీజేపీలో చేరికను వాయిదా వేసుకొని పోటీకి దూరంగా ఉన్నట్టు తెలిసింది.
దీంతో హుజూర్ నగర్ లో బీజేపీ తరుఫున శంకరమ్మను నిలబెట్టి టీఆర్ ఎస్ కు షాక్ ఇద్దామని యోచించిన బీజేపీకి కేసీఆర్ ముందు జాగ్రత్తతో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో బీజేపీ పెద్దలు హడావుడిగా సమావేశమై ‘శ్రీకళారెడ్డి’ అనే బీజేపీ మహిళా నాయకురాలిని హుజూర్ నగర్ బైపోల్ లో నిలబెడుతున్నట్టు ప్రకటించింది. ఈమె నామమాత్రపు అభ్యర్థి కావడంతో గెలుపుపై పెద్ద అంచనాలు లేవు. కేసీఆర్ వ్యూహంతో బీజేపీ గట్టి అభ్యర్థి శంకరమ్మను కోల్పోయినట్టైంది.