మహారాష్ట్ర రాజకీయం ఎన్ని మలుపులు తిరుగుతుందో చెప్పాల్సిన అవసరం లేదు. సొంత అన్న కొడుకు కదా అని నమ్మి.. ఎన్సీపీ శాసనసభాపక్ష నేతగా నియమిస్తే.. అందుకు భిన్నంగా షాకిచ్చిన అజిత్ పవార్ నిర్ణయం ఇప్పుడా పార్టీలోనే కాదు.. పవార్ కుటుంబంలోనూ కలకలం రేగేలా చేసింది. శరద్ పవార్ రాజకీయ వారసురాలిగా చెప్పే సుప్రియా సూలే తాజాగా తనదైన శైలిలో చేసిన ట్వీట్ ఆకట్టుకునేలా మారింది.
తన బాబాయ్ చేసిన పనిని తప్పు పడుతూనే ఆమె భావోద్వేగ ట్వీట్ ను సంధించారు. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవితంలో తానింతటి ద్రోహాన్ని చూడలేదన్నారు. ఎవరినైతే కాపాడామో వారే మోసం చేశారని.. జీవితంలో ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో అర్థం కావట్లేదన్నారు. తన జీవితంలోని క్లిష్టమైన రోజుల్లో ఇదొకటన్న ఆమె.. తన కుటుంబానికి ఇదో క్లిష్ట సమయంగా పేర్కొన్నారు.
తామున్న పరిస్థితుల్లో చాలామంది ప్రజలు మద్దతుగా నిలిచారని.. కష్టకాలంలో తమ వెన్నంటి ఉన్న వారికి ధన్యవాదాలుగా ఆమె ట్వీట్ లో పేర్కొన్నారు. సుప్రియో ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఆమె భావోద్వేగ సందేశం పలువురిని టచ్ చేసేలా ఉంది. పదవులకు ప్రాధాన్యత ఇవ్వకుండా బంధానికి విలువ ఇవ్వాలన్న సందేశం ఎలాంటి మార్పు తెస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తన సోదరుడికి ట్వీట్ సందేశంతో పాటు.. తన తండ్రి పడుతున్న కష్టాన్ని ట్వీట్ లో పేర్కొన్నారు. ఆయన విజయం సాధించినా.. ఓడినా నిజమైన మరాఠా యోధుడిలా పోరాటం చేస్తున్నారని తండ్రి మీద ప్రశంసల వర్షం కురిపించిన ఆమె.. వయసు.. ఆరోగ్యం సహకరించకపోయినా మోడీషాల లాంటి క్రూరమైన శక్తివంతులతో.. కుటుంబంలోని దేశద్రోహులతో యుద్ధం చేస్తున్నారంటూ మండిపడ్డారు.