కొద్దిరోజుల క్రితం దక్షిణాది మహిళలు నల్లగా ఉంటారని.. అయినా వారు అందంగా ఉంటారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సీనియర్ నేత.. జేడీ(యూ) అధినేత శరద్ యాదవ్ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆయన తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పటం తర్వాత.. దీనిపై రాజ్యసభలో మాట్లాడిన కేంద్రమంత్రి స్మృతి ఇరానీపై.. ''నీ గురించి నాంతా తెలుసు'' అంటూ విరుచుకుపడటం తెలిసిందే. శరద్ వ్యాఖ్యలపై ప్రముఖ సినీనటి.. ఎంపీ హేమమాలిని గళం విప్పారు. మహిళల్ని కించపరిచేలా మాట్లాడిన శరద్‌యాదవ్ క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.
పార్లమెంటుకు హాజరు కావటంలో పెద్దగా ఆసక్తి చూపరన్న ఆరోపణలున్న హేమమాలిని ఇప్పటివరకూ ఏ అంశం మీదా రియాక్ట్ అయ్యింది లేదు. అలాంటి ఆమెను సైతం శరద్‌యాదవ్ వ్యాఖ్యలు నోరు విప్పేలా చేయటం గమనార్హం. శరద్ యాదవ్ వ్యాఖ్యలపై మహిళా నేతలంతా తప్పు పడుతుంటే.. ఆయన కుమార్తె మాత్రం తన తండ్రి చేసిన వ్యాఖ్యలను మాత్రం సమర్థిస్తూ మద్దతు ఇస్తున్నారు.