పైనున్న నెంబర్స్ చూసి షాక్ అవ్వకండి. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే ప్రజల అభిమానం - ఆదరణతో అధికారంలోకి రావాలని అనుకుంటున్న జగన్.. అందుకు తగ్గ స్కెచ్ లను సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే దిగ్విజయంగా 13 జిల్లాలో పాదయాత్ర పూర్తి చేశారు. దీనిద్వారా పార్టీని - నవరత్నాలను ప్రజలకు పరిచయం చేశారు. ఇక ఇప్పుడు ప్రత్యక్షంగా ఎన్నికల రణక్షేత్రంలోకి దిగబోతున్నారు జగన్. అందుకే.. 7 జిల్లాల్లో ప్రచారం చేయాలని అనుకుంటున్నారు. మిగిలిన ఆరు జిల్లాల్లో జగన్ తరపున ఆయన సోదరి షర్మిళ ప్రచారం చేయబోతున్నారు.
షర్మిళ రాయలసీమ నాలుగు జిల్లాలైన కడప - కర్నూలు - అనంతపురం - చిత్తూరు జిల్లాలతో పాటు ప్రకాశం - నెల్లూరు జిల్లాలో ప్రచారం చేస్తుంది. ఈ జిల్లాల్లో వైసీపీకి మంచి పట్టు ఉంది. గత ఎన్నికల్లో కూడా ఇక్కడ నుంచే వైసీపీకి ఎక్కువ సీట్లు వచ్చాయి. ఇక మిగిలిన 7 జిల్లాలపై జగన్ ఫోకస్ పెట్టబోతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీకి కంచుకోటగా మారిన ఉభయగోదావరి జిల్లాల్నే ప్రధానంగా టార్గెట్ చేశారు జగన్. ఇప్పుడు ఇదే జిల్లాల్లో వైసీపీ ఎక్కువసీట్లు గెలవాలన్నదే జగన్ వ్యూహం. అందుకే.. ఉత్తరాంధ్ర - గోదావరి - కృష్ణా - గుంటూరు జిల్లాల్లో ప్రచారానికి జగన్ సిద్ధమవుతున్నారు. నోటిఫికేషన్ వచ్చేలోపే.. 13 జిల్లాల్ని కవర్ చేయాలనేదే తన ప్లాన్ అని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి.