సందేహాలు ఎక్కువ కాలం లైవ్ లో ఉంచకూడదు. అదే జరిగితే.. దాని కారణంగా జరిగే నష్టం అంతా ఇంతా కాదు. ఈ విషయాన్ని తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత షర్మిల బాగానే గుర్తించినట్లుగా కనిపిస్తోంది. తన మీద వచ్చే విమర్శలు..ఆరోపణలకు సమాధానాలు ఇవ్వాలని ఆమె డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా నిర్వహించిన మీడియా మీట్ లో జర్నలిస్టులు తమ పాత్రను నూటికి నూరు శాతం పోషించారు.
ఇటీవల కాలంలో తమ ప్రశ్నల దాహాన్ని తీర్చుకునేందుకు ఏ రాజకీయ అధినేత అవకాశం ఇవ్వని వేళ.. అందుకు భిన్నంగా మీరు ఏం అడిగినా సరే.. ఆ ప్రశ్నకు సమాధానం చెబుతానన్న రీతిలో వ్యవహరించిన షర్మిలకు.. చురుకు పుట్టే ప్రశ్నలు ఎదురయ్యాయి.
అయినా.. వాటికి తొణక్కుండా.. బెణక్కుండా.. ఫుల్ గా ప్రిపేర్ అయి వచ్చానన్నట్లుగా ఆమె సమాధానాలు చెప్పటం పలువురిని ఆకర్షించింది. షర్మిల ప్రెస్ మీట్ ఏం చూస్తాంలే అన్న స్థానం నుంచి.. ఇంకేం చెబుతుందన్న ఎంగ్జైంటీ పెరిగేలా చేయటంలో ఆమె సక్సెస్ అయ్యారు. ఇటీవల కాలంలో ఇంత ఘాటైన ప్రశ్నలు మరెవరికీ ఎదురు కాలేదు.
ఒకప్పుడు హైదరాబాద్ ను పాకిస్థాన్ తో పోల్చిన మీరు.. .ఇక్కడ పార్టీ పెట్టడాన్ని ఎలా సమర్థించుకుంటారన్న ప్రశ్నకు షర్మిల కూల్ గా సమాధానం చెప్పారే కానీ.. ఎక్కడా విరుచుకుపడలేదు.. ఏం ప్రశ్న అడుగుతున్నావ్? ఏ చానల్ నీది? ఏ మీడియా సంస్థ నీదంటూ ఎదురుదాడి చేసే ప్రోగ్రాం పెట్టలేదు.
ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వటం.. ఇచ్చే క్రమంలో తెలంగాణ అంశాల మీద తనకున్న క్లారిటీని ప్రదర్శించటమే కాదు.. అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలో తన రాజకీయ ప్రత్యర్థులకు పంచ్ లు మీద పంచ్ లు వేయటం కనిపించింది. ఆమె చేసిన వ్యాఖ్యలకు చెందిన చిట్టి వీడియోలు సోషల్ మీడియాతో పాటు.. వాట్సాప్ గ్రూపుల్లోనూ భారీగా షేర్ అయ్యాయి.
ఆసక్తికరమైన విషయం ఏమంటే.. తన పొలిటికల్ పార్టీ మీదా.. తెలంగాణలో రాజకీయాలు నడపటంపైనా క్లియర్ గా సమాధానాలు చెప్పినప్పటికి ఆమె ఆన్సర్లకు సానుకూల స్పందన రాలేదన్న మాట వినిపిస్తోంది.
ఆమె చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తలకు.. కింద కామెంట్ సెక్షన్ లో పోస్టు చేసిన వ్యాఖ్యలు చూస్తే.. షర్మిల ఎంత ప్రయత్నించినా.. తెలంగాణలో ఆమె పెట్టిన పార్టీపై పాజిటివ్ కంటే కూడా నెగిటివ్ కామెంట్లే ఎక్కువగా ఉండటం కనిపిస్తోంది.
మరి.. ముఖ్యంగా ఆమె పార్టీ పెట్టటం ద్వారా తన సోదరుడు కమ్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న అర్థం వచ్చేలా కామెంట్లు ఉండటం గమనార్హం. అంతేకాదు.. షర్మిల మాటల్ని ఖండఖండాలుగా చీల్చి చెండాటమే లక్ష్యమన్నట్లుగా కొందరు పెడుతున్న పోస్టులు చూస్తే.. ఆమెకు ఆన్ లైన్ లో సానుకూలత కంటే కూడా ప్రతికూలతే ఎక్కువగా ఉందన్న భావన కలుగుతోంది. మరి.. నెటిజన్ల మనసుల్ని దోచుకునే అస్త్రం షర్మిల వద్ద ఏముందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.