ఏపీలో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. అక్కడ కరెంటు లేదు.. నీళ్లు లేవు.. రోడ్లు కూడా బాగాలేవు.. అక్కడ నుంచి వచ్చిన నా స్నేహితులు చెప్పారు.. అంటూ..ఏపీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల మధ్య తీవ్ర ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే.ఈ విషయం రెండు రాష్ట్రాల మంత్రులు ఒకరిపై ఒకరు కామెంట్లు విసురుకున్నారు.
ఇక, ఈ విషయంలో జోక్యం చేసుకున్న ఏపీ సీఎం జగన్ సోదరి, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు.. షర్మిల.. కేటీఆర్‌పై వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌కు ఏపీలోనే స్నేహితులు ఉన్నారని.. తెలంగాణలో లేరా? అంటూ.. విమర్శలు గుప్పించారు.
ఈ మేరకు ట్విట్టర్లో ఆమె స్పందించారు. ‘‘కేటీఆర్ దోస్తులంతా మేఘా కృష్ణారెడ్డి, ఫినిక్స్ సురేష్ లాంటి..వారే ఉన్నారు. వీరంతా ఆంధ్రా ధనవంతులే కదా!. తెలంగాణలో ఉద్యమకారులు, రైతులు, నిరుద్యోగులు, ఆదివాసీలు ఉన్నారు. పేదలతో స్నేహం చేసుంటే కదా చిన్నదొరకి ప్రజల కష్టం తెలిసేది? చిత్తం శివుడి మీద..భక్తి చెప్పుల మీద!: ఉంది’’ అని షర్మిల ట్వీట్ చేశారు.
అంతేకాదు.. అదేసమయంలో భద్రాద్రి కొత్తగూడెంలో యాత్ర చేస్తున్న షర్మిల ప్రజలను ఉద్దేశించి కూడా ఇలానే వ్యాఖ్యానించారు. కేటీఆర్‌కు తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన వారు స్నేహితులు కారని మండిపడ్డారు. ఆయనకు ధనవంతులు మాత్రమే.. స్నేహితులుగా ఉన్నారని అన్నారు.
షర్మిలపై తెలంగాణ వాసుల ఫైర్!!
అయితే..షర్మిల చేసిన ఈ వ్యాఖ్యలపై తెలంగాణ వాసులు ఫైర్ అవుతున్నారు. షర్మిలకు ఏపీపై ఉన్న ప్రేమ బయటపడిందని.. ఇక్కడి మేధావులు చెబుతున్నారు. ఎందుకంటే.. తెలంగాణలో పార్టీ పెట్టి.. తెలంగాణ ఉన్నతిని కీర్తించాల్సిన నాయకురాలు.,. ఏపీని ఒక్కమాట అనేసరికి.. ఇలా గొంతు చించుకున్నారే!! అంటే.. ఆమెకు పుట్టిపెరిగిన రాష్ట్రంపై ఉన్న ప్రేమ.. మెట్టినింటి రాష్ట్రంపైనా.. పార్టీ పెట్టిన రాష్ట్రంపైనా లేదని.. మరోసారి నిరూపితమైందని.. వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు.. ఇప్పటి వరకు షర్మిల తాను తెలంగాణ బిడ్డనని.. ఇక్కడే మెట్టానని.. ఇక్కడి ప్రజలతోనే ఉన్నానని చెప్పిన మాటలన్నీ బూటకమేనా? అని మేధావులు సైతం ప్రశ్నిస్తున్నారు.
వారికి ఊసు ఏది షర్మిలమ్మా?!
ఏపీని కేటీఆర్ ఏదో అన్నారు. సరే.. ఇది తప్పా.. ఒప్పా.. పక్కన పెడితే.. ఏపీ మంత్రులు తెలంగాణ పరువు తీసేశారు కదా! ``నేను హైదరాబాద్‌లోనే ఉంటున్నాను .అక్కడ కరెంటు లేదు. జనరేటర్ వాడుతున్నాను..`` అని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మరి ఆయన వ్యాఖ్యలపై షర్మిల ఎందుకు స్పందించలేదు. హైదరాబాద్‌ను అగ్రస్థానంలో నిలబెట్టాలని.. కోరుకునే నాయకురాలైతే.. బొత్సకు కౌంటర్ ఇవ్వాలి కదా! మరి ఈ ఊసు ఎందుకు లేవనెత్తలేదు.
అంతేకాదు.. మరో మంత్రి, ఏపీ హోం శాఖ అమాత్యురాలు.. తానేటి వనిత ఏకంగా.. హైదరాబాద్‌ను కించపరిచేలా వ్యాఖ్యానించారు. అక్కడ మద్యం సంస్కృతి, డ్రగ్స్ సంస్కృతి పెరిగిపోయిందని.. కానీ.. ఏపీలో అలాంటి సంస్కృతి లేదని అన్నారు. మరిఈ మాటలు.. షర్మిలకు వినిపించలేదా? ఒక్క కేటీఆర్ వ్యాఖ్యలే వినిపించాయా? అని నిలదీస్తున్నారు. అంటే.. షర్మిల ఒకవైపే చూస్తున్నారు.. అది ఏపీ, ఆమె ఒకవైపే వింటున్నారు.. అది కూడా ఏపీనే.. మరి ఆమెకు తెలంగాణతో పనేంటి? అని ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి షర్మిలక్క ఏం చెబుతారో చూడాలి.