20న ఖమ్మంలో షర్మిల మీటింగ్.. కొనసాగుతున్న దూకుడు!

Update: 2021-02-10 15:13 GMT
తెలంగాణ‌లో రాజ‌కీయ పార్టీ ఏర్పాటు దిశ‌గా ష‌ర్మిల వేగంగా దూసుకెళ్తున్నారు. హైద‌రాబాద్ లోని లోట‌స్ పాండ్ లో మంగ‌ళ‌వారం న‌ల్గొండ జిల్లాకు చెందిన వైఎస్ఆర్ అభిమానుల‌తో స‌మావేశ‌మైన శ‌ర్మిల‌.. త‌న నెక్స్ట్ మీటింగ్ ఖ‌మ్మంలో పెట్ట‌బోతున్నారు. దీంతో.. పార్టీ ఏర్పాటు ప్ర‌క‌ట‌న ఆషామాషీగా చేసిందేమీ కాద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

లోటస్ పాండ్‌లో న‌ల్గొండ జిల్లాకు చెందిన నేత‌ల‌తో భేటీ అయిన ష‌ర్మిల‌.. వారి ప్రాంతాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పాలని కోరారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్ర‌ధాన స‌మ‌స్య‌ల గురించి అడిగి తెలుసుకున్నారు. త్వ‌ర‌లో ఖ‌మ్మంలో స‌మావేశం నిర్వ‌హించ‌నుండ‌డంతో అక్క‌డ కూడా స్థానిక ప‌రిస్థితుల‌పై వాక‌బు చేసే అవ‌కాశం ఉంది. అంతేకాకుండా.. పార్టీలో క్రియాశీల‌కంగా న‌డిచే నాయ‌కుల‌ను కూడా ఈ స‌మావేశాల ద్వారా గుర్తించ‌బోతున్న‌ట్టు స‌మాచారం.

ఉమ్మ‌డి జిల్లాల‌కు సంబంధించిన నాయ‌కుల‌తో స‌మావేశ‌మై.. ఆయా ప్రాంతాల్లో ప‌రిస్థితుల‌పై అవ‌గాహ‌న తెచ్చుకోవ‌డంతోపాటు నాయ‌క‌త్వాన్ని త‌యారు చేసుకునే ఉద్దేశంతోనే ఈ స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ స‌మావేశాలు వేగంగా పూర్తిచేసి, మార్చిలో పార్టీ జెండాను ఆవిష్క‌రించ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

తెలంగాణ‌లో రాజన్న రాజ్యం తెస్తానని చెప్పిన ష‌ర్మిల‌.. త‌న తండ్రి పేరు క‌లిసి వ‌చ్చేట్టుగా పార్టీకి YSRTP అని నామ‌క‌ర‌ణం చేస్తార‌ని జోరుగా ప్రచారం జరుగుతోంది. జిల్లాల వారీగా నిర్వ‌హించే స‌మావేశాల అనంత‌రం.. వైఎస్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనాన్ని కూడా నిర్వహించే యోచనలో ఉన్నట్టు స‌మాచారం.
Tags:    

Similar News