రాజకీయాల్లో ఎప్పుడూ జాగ్రత్తగా అడుగులు వేయాలి.. లేకుంటే అంతర్థానం అయిపోతారనడానికి రెండు ఉదాహరణలు మన కళ్ల ముందు ఉన్నాయి. ఒకటి రాష్ట్రాన్ని విభజించిన పాపంతో కాంగ్రెస్ పార్టీ ఏపీలో అంతర్థానమైపోగా.. తెలంగాణలో రెండు సార్లు ఓడిపోయింది.
ఇక రెండోది.. రెండు కళ్ల సిద్ధాంతం పేరిట ఏపీకి పెద్దపీట వేసిన టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణ లాంటి ఒక కన్నును కోల్పోయారు. తెలంగాణలో పార్టీని నామరూపాల్లేకుండా చేసుకున్నారు. ఏదైనా ఏపీ స్టాండ్ తీసుకొని ముందుకెళ్లిన సీఎం జగన్ అక్కడ సీఎం అయ్యారు.
ఇలా ఏదో ఒక స్టాండ్ తీసుకొని పోరాడిన వారే రాజకీయాల్లో సజీవంగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధనే ధ్యేయంగా అడుగులేసిన కేసీఆర్ రాష్ట్రానికి రెండు సార్లు సీఎం అయ్యారు.
ఇప్పుడు తెలంగాణలో కొత్త పార్టీతో పోరాడుతున్న వైఎస్ షర్మిల పాత బ్యాక్ గ్రౌండ్ ఆమెను కలవరపెడుతోంది. వైఎస్ షర్మిల ఉమ్మడి ఏపీ విభజన వేళ వైసీపీకి మద్దతుగా.. అన్న జగన్ కు తోడుగా చేసిన ఉద్యమం ఇప్పుడు బయటకు వస్తోంది. షర్మిల ఏపీని విభజించవద్దని నాడు 2014కు ముందు చేసిన ‘సమైఖ్యాంద్ర శంఖారావాన్ని’ ఇప్పుడు తెలంగాణ నెటిజన్లు బయటకు తీశారు. పలు పార్టీలు సమైఖ్యాంధ్ర కోసం వైఎస్ షర్మిల చేసిన పోరాటం.. నాడు తెలంగాణను విభజించవద్దని బస్సు యాత్ర చేసిన వీడియోలు, ఫొటోలు, వార్తలను ఇప్పుడు సర్క్యూలేట్ చేస్తున్నారు. వాటిని వైరల్ చేస్తూ షర్మిలను ఎండగడుతున్నారు.
నాడు వైఎస్ షర్మిల ‘తాను సమైక్యాంద్రేక కట్టుబడి ఉన్నానని సభల్లో చెప్పిన వీడియోను’ నెటిజన్లు బయటకు తీస్తున్నారు. హైదరాబాద్ ను తెలంగాణకే ఇవ్వడాన్ని షర్మిల ఖండించారు. ఇది రాష్ట్ర ప్రజలందరిది అని నినదించారు. ఏపీకి అన్యాయం చేస్తున్నారని ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణను ఏర్పాటు చేయకుండా ఉద్యమించాలని.. ఏపీ పార్టీలు ఒక్కటవ్వాలని నాడు షర్మిల అన్న మాటల వీడియోలను ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. తెలంగాణ ఏర్పడితే ఏపీ నీటి సమస్యలతో ఏడారి అవుతుందన్నారు. ఇలా షర్మిల సమైక్యాంధ్ర ఉద్యమ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
తెలంగాణను అడుగడుగునా అడ్డుకోవడానికి ప్రయత్నించిన వైఎస్ షర్మిల ఇప్పుడు తెలంగాణలో ఎలా రాజకీయం చేస్తుందని ఇక్కడి వాసులు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. షర్మిల ‘సమైఖ్యాంధ్ర ఉద్యమాన్ని’ ట్రోల్ చేస్తున్నారు.
నాడు తెలంగాణ వద్దని.. నేడు తెలంగాణ కోసం ఎలా పనిచేస్తారని వైఎస్ షర్మిలను నెటిజన్లు కడిగి పారేస్తున్నారు. షర్మిల మనసు ఆంధ్రా వైపే ఉంటుందని.. ఆమె తెలంగాణ బిడ్డ కాదంటూ సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు.
అప్పుడెప్పుడో ఉమ్మడి ఏపీలో సమైఖ్యాంద్ర కోసం వైఎస్ షర్మిల భారీ సభలు, సమావేశాలు, బస్సు యాత్రలు చేసి తెలంగాణను అడ్డుకుంది. ఇప్పుడు ఆ పాత 2014కు ముందు నాటి ఏపీ ఉద్యమ వార్తలను, వీడియోలను తీసి షర్మిలను ప్రత్యర్థులు ఆడుకుంటున్నారు.
అన్నింటికి సమాధానం చెబుతున్న షర్మిల ‘ఈ సమైఖ్యాంధ్ర ఉద్యమంపై’ ఆమె సాగించిన పోరాటాన్ని మాత్రం ప్రస్తావించడం లేదు. ఏపీ కోసం కొట్లాడి తెలంగాణలో రాజకీయం చేయడానికి వచ్చిన షర్మిలను జనాలు నమ్మరంటూ ఈ వీడియోలు, వార్తలతో ప్రత్యర్థులు తెగ బ్లేమ్ చేసేస్తున్నారు. మరి వైఎస్ షర్మిల ఈ ప్రచారాన్ని ఎలా ఎదుర్కొటారు? ఎలా అరికడుతారు? వీటికి ఎలాంటి సమాధానం ఇస్తారన్నది ఆసక్తి రేపుతోంది.