ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన సోదరి షర్మిలకు మధ్య మనస్పర్థలు ఉన్నాయన్న విషయం పాతదే అయినా.. ఆ గొడవల తీవ్రత ఎంత ఎక్కువగా ఉందన్న విషయం తాజాగా తేలిందని చెప్పాలి. రాఖీ పండుగ రోజున ఈ అన్నాచెల్లెళ్లు కలుస్తారా? అన్నకు షర్మిల రాఖీ కడుతారా? అన్న విషయం ఆసక్తికరంగానే కాదు.. ఉత్కంటగా మారింది. రాఖీ పండుగ రోజున షర్మిల ఏం చేస్తారన్న దానిపై చర్చ జరిగింది. అన్న కంటే చెల్లెలు మరింత మొండిదన్న విషయం రాఖీ వేళ తేలిపోయింది.
అన్నకు రక్షా బంధన్ కట్టేందుకు వెళ్లని షర్మిల.. ఒక ట్వీట్ తో సరి పెట్టేశారు. అందులో ప్రస్తావించిన విషయాన్ని చూసినప్పుడు.. తన మాటలతో అన్నను చిన్నబుచ్చేలా ఉందన్న అభిప్రాయం కలుగక మానదు. తన ఆశయానికి.. సిద్ధాంతానికి అండగా నిలిచిన వారంతా తన తోడబుట్టిన సోదరుడితో సమానమన్నట్లుగా ట్వీట్ చేయటాన్ని పలువురు తప్పు పడుతున్నారు.
సొంత అన్నను తన రాజకీయ ప్రయోజనాలకు లింకు పెట్టేలా షర్మిల చేయకుంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ‘నా తోడబుట్టిన జగనన్నకు మరియు నేను నమ్మిన సిద్ధాంతం కోసం నాకు అండగా నిలిచిన, నేనెంచుకున్న మార్గంలో నాతో కలిసి నడుస్తున్న, నా ఆశయ సాధనలో నన్ను నిలబెడుతున్న ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి సుఖ సంతోషాలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి సోదరి షర్మిల. హ్యాపీ రాఖీ’ అని ఆమె ట్వీట్ పోస్టు చేశారు.
రాజకీయం భార్యను.. భర్తను దూరం చేస్తుందని.. అన్నదమ్ముల బంధాన్ని బద్ధలు చేస్తుందన్న దానికి తగ్గట్లే.. జగనన్న మాట కాదని.. పార్టీ పెట్టిన షర్మిల.. అన్న వద్దకు వెళ్లేందుకు మొహమాటపడి.. ట్వీట్ తో సరిపుచ్చారన్న మాట వినిపిస్తోంది. తన ఆశయానికి అండగా ఉండేవారంతా.. తోడబుట్టిన జగన్ తో సమానం అవుతారా? అన్నది ప్రశ్న. ఇలాంటి మాటలు సినిమా డైలాగులుగా.. ట్వీట్లుగా బాగుంటాయేమో కానీ.. వాస్తవిక జీవితంలో మాత్రం అతికినట్లుగా అనిపించవన్న విషయాన్ని షర్మిల మిస్ అయినట్లుగా కనిపిస్తోంది.
మొత్తంగా చూసినప్పుడు .. రాఖీ రోజున అన్నను కలవని షర్మిల.. ట్వీట్ తో సరిపెట్టటమే కాదు.. అందులోనూ తన ఆశయానికి ఓకే చెప్పే వారంతా తన అన్నతో సమానమన్నట్లుగా ఇచ్చిన బిల్డప్ సరైంది కాదన్న మాట వినిపిస్తోంది. వీరి మధ్య దూరాన్ని కాలం ఏం చేస్తుందో చూడాలి.