పొరపాటున పార్టీ పేరు లీక్ చేసిన వైఎస్ షర్మిల

Update: 2021-03-25 16:48 GMT
దివంగత వైఎస్ఆర్ కూతురు, ఏపీ సీఎం జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. నేతలు, వైఎస్ఆర్ అభిమానులతో వరుస భేటీలు జరుపుతున్నారు. వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు.

ఏప్రిల్ 9న ఖమ్మంలో నిర్వహించతలపెట్టిన బహిరంగ సభలో పార్టీ ప్రకటన చేయబోతున్నారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో పార్టీ పేరు, జెండాను అధికారికంగా ప్రకటించనున్నారు.

తాజాగా ఈరోజు షర్మిల ముఖ్యనాయకులతో భేటి అయ్యారు. వారిని ఉద్దేశించి ప్రసంగిస్తే ‘వచ్చే ఎన్నికల్లో వచ్చేది మన ‘వైఎస్ఆర్ పార్టీ’యేనని షర్మిల పొరపాటున ఠంగ్ స్లిప్ అయ్యారు. తన పార్టీకి వైఎస్ఆర్ అనే పేరు చాలు అని అన్నారు.

ఏపార్టీతోనూ పొత్తులు ఉండవని.. తాను టీఆర్ఎస్ చెబితేనో.. బీజేపీ అడిగితేనో రాజకీయాల్లోకి వచ్చిన వాళ్లం కాదని షర్మిల స్పష్టం చేశారు. తెలంగాణలో రాజన్న రాజ్యం అందివ్వడమే ధ్యేయం అన్నారు.

వచ్చేనెల 9న ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభలో నూతన పార్టీని ప్రకటించనున్నట్టు షర్మిల తెలిపారు. ఈ మేరకు వాల్ పోస్టర్, కరపత్రాన్ని విడుదల చేశారు.
Tags:    

Similar News