భర్త అనిల్ కు థ్యాంక్స్ చెప్పిన షర్మిల

Update: 2021-04-09 10:30 GMT
వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లో ప్రవేశిస్తున్నారు. ఈరోజు ఖమ్మంలో నిర్వహించే సభలో తన పార్టీ జెండా, రంగు, విధివిధానాలు వెల్లడించనున్నారు. ఏపీలో అధికారంలో వైసీపీని, సీఎం అయిన అన్న జగన్ ను కాదని ఒంటరిగా తెలంగాణలో ప్రయాణం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే తన తెలంగాణ ప్రయాణానికి అండగా నిలిచిన వారిని ఈ సందర్భంగా షర్మిల గుర్తు చేశారు.

తాజాగా భర్త, బద్రర్ అనిల్ కుమార్ ట్వీట్ చేశాడు. తన భార్య తెలంగాణలో రాజకీయ ప్రవేశానికి శుభాకాంక్షలు చెబుతూ ఆల్ దిబెస్ట్ అంటూ విషెస్ చెప్పారు. ఈ ట్వీట్ ను రీట్వీట్ చేసిన వైఎస్ షర్మిల ఈ సందర్భంగా తనను వైఎస్ఆర్ మార్గంలో నడవడానికి సహకరిస్తూ తన వెన్నంటి ఉన్న భర్త అనిల్ కు కృతజ్ఞతలు తెలిపారు. అనిల్ కుమార్ అన్ని కష్టాల్లోనూ తోడుగా ఉన్నారని.. ప్రోత్సాహాల్లో భర్త అందించిన సహకారం మరువలేనిది అని  చెప్పుకొచ్చింది.

వైఎస్ షర్మిల ట్వీట్ చేస్తూ.. 'దివంగత వైయస్ఆర్ గారి మార్గంలో  నేను నడవాలనకుంటున్నారు. నా జీవితంలో అత్యంత ముఖ్యమైన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నప్పుడు .. ప్రియమైన అనిల్, మీరు నాకు ఇచ్చిన అన్ని మద్దతు మరియు ధైర్యానికి ధన్యవాదాలు చెప్పడానికి ఇదే సరైన సమయం. ఇది మాకు.. తెలంగాణ ప్రజలకు కొత్త ప్రారంభం'' అంటూ షర్మిల పేర్కొన్నారు.  

ఈ సందర్భంగా భర్త అనిల్ తో దిగిన ఫొటోను వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. వీరి ఫొటో వెనుకలా మధ్యలో వైఎస్ఆర్ ఫొటో ఉండడం విశేషం.  షర్మిలా నీలిరంగు అంచుతో లేత పసుపు రంగు చీర ధరించింది. సిరిసిల్ల చేనేత కార్మికులు నేసిన ఈ చీరతోపాటు వైఎస్ఆర్ గడియారం ధరించింది.
Tags:    

Similar News