ప్రఖ్యాత బాక్సర్ మహమ్మద్అలీకి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని హాలీవుడ్ శృంగారతార షరాన్ స్టోన్ చెప్పుకొచ్చింది. అలీకి నివాళి అర్పించే క్రమంలో ఆశ్చర్యకరమైన విషయాన్ని ఆమె వెల్లడించారు. తాను 17 ఏళ్ల వయసులో మిస్ పెన్సిల్వేనియాగా ఉన్నప్పుడు అలీని తాను తొలిసారిగా కలిసినట్లుగా ఆమె చెప్పారు. ఆ సమయంలో తన తండ్రి తనతోనే ఉన్నారని.. ఆయనతో అలీ మాట్లాడుతూ ‘మీ అమ్మాయికి నేను తీసే సినిమాలో ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నా’ అని చెప్పారని.. కానీ.. తన తండ్రి ఆ అఫర్ ను తిరస్కరించినట్లుగా చెప్పారు.
నా కుమార్తె సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లదని అలీకి తన తండ్రి తేల్చి చెప్పగా.. అలీ మాత్రం.. ‘‘తను సినిమా ఇండస్ట్రీలో రాణిస్తుంది. కెరీర్ లో గొప్ప ఎత్తుకు ఎదుగుతుంది’ అని చెప్పారట. ఆ తర్వాత అలీ చెప్పినట్లే తాను స్టార్ అయ్యానని వెల్లడించిన ఆమె.. 2012లో అలీని తాను మరోసారి కలిసినట్లు చెప్పారు. నాడు జరిగిన విషయాల్ని ఆమె చెబుతూ..
‘‘మహమ్మద్ అలీ ఛారిటీ ఈవెంట్ లో భాగంగా ఆయన్ను కలిశాను. అప్పటికి ఆయన పార్కిన్సన్ వ్యాధితో బాధ పడుతున్నారు. నేను నా టీనేజ్ విశేషాల్ని చెబుతూ.. తనకు సినిమా ఆఫర్ ఇచ్చిన విషయాన్న గుర్తు చేశాను. ఆయన మౌనంగా ఉన్నారు. దాంతో.. ఆయన మర్చిపోయి ఉండొచ్చని అనుకున్నా. కానీ.. కాసేపటికి నా దగ్గరకు ఆయన వచ్చి.. ఆ రోజున నేను వేసుకున్న బ్లూ డ్రస్ వేసుకున్నావు కదా? అంటూ చెప్పారు.. నేను షాక్ తిన్నా’’ అని చెప్పుకొచ్చింది. రింగ్ లో తనకు ఎదురయ్యే ప్రత్యర్ధి విషయంలోనే కాదు.. మిగిలిన వారి విషయంలోనూ ఆయన అంచనా ఎలా ఉంటుందన్న దానికి షరాన్ స్టోన్ చెప్పిన ఉదంతం పర్ ఫెక్ట్ ఎగ్జాంఫుల్ అని చెప్పొచ్చు.