మనకు తెలిసిందే సమస్తం అనుకోవటంతోనే సమస్యంతా. ఆర్థికమంత్రి కావాలంటే ఆర్థికవేత్త అస్సలు కావాల్సిన అవసరమే లేదు. అందరూ ఎంతగానో అభిమానించి.. ఆరాధించే మోడీ ప్రభుత్వంలో కీలకమైన కేంద్రమంత్రిత్వ శాఖల్ని నిర్వహించే వారి ప్రొఫైల్స్ విచిత్రంగా ఉంటాయి. దీనికి తగ్గట్లే.. అప్పుడప్పడు వారు చేసే వ్యాఖ్యలు వివాదాస్పదం కావటమే కాదు.. ఆసక్తికర చర్చకు తెర తీసేలా ఉంటుంది.
కేంద్ర ఆర్థికమంత్రి నోటి నుంచి వచ్చే ప్రతి మాటకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి స్థానంలో ఉన్నప్పుడు చేసే వ్యాఖ్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి అన్నట్లు మాట్లాడాలి. అందుకు బదులుగా తోచింది అనేస్తే ఇప్పుడు ఎదురయ్యే ఇబ్బందే రిపీట్ అవుతుంది. అసలే కార్ల అమ్మకాలు పడిపోయి.. ఎంత ప్రయత్నించినా లేవకుండా ఉన్న వేళలో.. ముసురుకుంటున్న మాంద్యం దెబ్బతో కార్ల కంపెనీలు కిందామీదా పడిపోతున్నాయి.
ఈ గండం నుంచి ఎలా గట్టెక్కాలా? అంటూ తెగ థింక్ చేస్తున్న పరిస్థితి. ఇలాంటి వేళ.. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ మధ్యన చేసిన వ్యాఖ్య కొత్త అయోమయాన్ని తీసుకొచ్చింది. 20 నుంచి 40 ఏళ్ల మధ్యనున్న వారు కార్లు కొనటానికి బదులు ఓలా.. ఉబెర్ లాంటి టాక్సీ సేవల్ని వాడేస్తున్నారని.. ఈ కారణంతోనే దేశ ఆటోమొబైల్ అమ్మకాలు పడిపోయినట్లుగా తేల్చేశారు.
దేశంలో కార్ల అమ్మకాలు పడిపోవటాన్ని నిర్మలమ్మ ఎంత సింఫుల్ గా తేల్చేశారంటూ చాలామంది అవాక్కు అయిన పరిస్థితి. ఎందుకంటే ఇందులో వాస్తవం తక్కువగా ఉండటమే. కేంద్రమంత్రి నోటి నుంచి ఇలాంటి మాటలు వచ్చినప్పుడు కార్పొరేట్ కంపెనీలు రియాక్ట్ కావటానికి ఇష్టపడవు. మరేం అనుకున్నారో కానీ మారుతి పెద్దాయన మాత్రం నిర్మలమ్మ వ్యాఖ్యలు తప్పన్నట్లు స్పష్టం చేశారు.
ప్రస్తుత మందగమనానికి ఓలా.. ఉబర్ లాంటివి వినియోగించటం ఎంత మాత్రం కాదన్న విషయాన్ని స్పష్టం చేస్తూ.. ఇలాంటి అభిప్రాయానికి రావటానికి పూర్తిస్థాయి అధ్యయనం అవసరమని తేల్చారు. మారుతి సుజుకి ఇండియా ఈడీ శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. యువత కార్లు కొని ప్రతి నెలా ఈఎంఐలు చెల్లించటానికి ఇష్టపడటం లేదని.. దీనికి బదులుగా ట్యాక్సీ సేవలవైపు మళ్లుతున్నట్లు చెప్పిన మాటల్లో నిజం లేదన్నది కార్ల పరిశ్రమల వాదన.
ఎందుకంటే.. ‘‘ఓలా - ఉబెర్ గత ఆరు - ఏడేళ్లుగా మార్కెట్ లో ఉన్నాయి. ఈ సమయంలో ఆటో పరిశ్రమ అత్యుత్తమ ప్రదర్శన చవిచూసింది. గత కొన్ని నెలల్లోనే ఏమైంది? ఇది ఓలా - ఉబెర్ వల్లేనని ఆలోచించకండి’’ అన్నది మారుతి పెద్దాయన మాట. అంతేకాదు.. అమెరికాలో ఉబెర్ బలమైన ప్లేయర్ గా ఉన్నప్పటికీ - అక్కడ కార్ల విక్రయాలు గత కొన్ని సంవత్సరాల్లో బలంగానే ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు.
కార్ల అమ్మకాల మీద ప్రభావం చూపించే అంశాల విషయానికి వస్తే.. నిధులు.. రుణాల కారణంగా తలెత్తే కొరత.. భద్రతా ఫీచర్ల వాటి కారణంగా పెరిగిన ధరలు.. అధిక పన్నులు.. బీమా ప్రీమియం రేట్లు పెరగటం లాంటి కారణాలు ఉన్నట్లు చెప్పారు. ఆయన చెప్పినట్లు ఎంత ఓలా.. ఉబర్ ఉన్నా.. వీకెండ్ లో ఫ్యామిలీతో కలిసి బయటకు వెళ్లాలంటే.. సొంత కారుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని మర్చిపోకూడదు. మొత్తంగా చూస్తే.. నిర్మలమ్మ మాటలు తొందరపాటుతో ఉన్నాయన్నట్లుగా మారుతి పెద్దాయన మాటలు లేవు?