సినీ నటులు, రాజకీయ నాయకులకు మధ్య విభజన రేఖ ఎప్పుడో చెరిగిపోయింది. సిద్ధాంత వైరుద్యాలు నాయకుల మధ్యనే ఉంటాయనుకుంటే అది సినీనటులు-నాయకుల మధ్యకు చేరింది. తాజాగా బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, కాంగ్రెస్ నేత శశి థరూర్ మధ్య ఇలాంటి మాటల యుద్ధమే జరిగింది. అయితే అది సభా వేదికగా కాకుండా ట్విట్టర్‌లో జరగడం గమనార్హం. అనుపమ్ కేర్ ఇటీవల అసహనంకు వ్యతిరేకంగా గళం విప్పారు. ఈ క్రమంలో బీజేపీ పెద్దల మనసు గెలుచుకున్నాడు.
అయితే పద్మా అవార్డుల పరిణామం నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు శశీథరూర్ ఖేర్‌ను కెలికారు. ఖేర్ నువ్వు సంఘ్ భావజాలమున్న హిందూవి అని థరూర్ ట్వీట్ చేశారు. దీనికి ఖేర్ తానేమీ తక్కువ తినలేదన్నట్లు ఏకంగా ఓ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసి అందులో శశీథరూర్‌పై విరుచుకుపడ్డారు. " శశీ.. కాంగ్రెస్ నాయకులంటే వక్రీకరణలకు పెట్టింది పేరు. కానీ నువ్వు కూడా మిగతావారిలాగా నా వ్యాఖ్యలను వక్రీకరించావ్. తద్వారా కాంగ్రెస్ చెంచాలాగా వ్యవహరించావు. ఇది నేను ఊహించలేదు" అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చారు.
దీంతో శశి థరూర్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తాను హిందువునేనని, ఇలా ప్రకటించుకునేందుకు తాను గర్వపడతానని ప్రకటించారు. అయితే ఆర్ఎస్ఎస్ భావజాలమున్న వ్యక్తిని మాత్రం కాదని తేల్చిచెప్పారు. పైగా వాదనలో ఓడిపోవడం వల్లే తనను చెంచా అంటూ విమర్శలకు పాల్పడ్డారని మండిపడ్డారు. దీనిపై ఖేర్ మళ్లీ ట్వీటారు. అసలు వివాదం రాజేసిందే థరూర్ అని పేర్కొంటూ అనవసరంగా సంఘ్ వంటి అంశాలను తెరమీదకు తెచ్చారని వ్యాఖ్యానించారు. ఇలా బాలీవుడ్ వర్సెస్ ఢిల్లీ పెద్దలు అన్నట్లుగా ప్రస్తుతం రాజకీయం రంజుగా సాగుతోంది.