సుమిత్ర మరణించిందని ట్వీట్.. సారీ చెప్పిన శశిథరూర్

Update: 2021-04-23 07:32 GMT
కాంగ్రెస్ సీనియర్ నేత మరో వివాదంలో చిక్కుకున్నారు.  లోక్‌సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ మృతి చెందిందని ట్వీట్ చేసి దుమారం రేపాయి. ఈ ట్వీట్ కాంగ్రెస్ ఎంపి శశి థరూర్ గురువారం ఏప్రిల్ 22న చేయడం వివాదానికి దారితీసింది.

"ప్రముఖ బిజెపి నాయకురాలు సుమిత్రా మహాజన్ మరణం" అంటూ శశి థరూర్ తన ట్వీట్ లో సంతాపం తెలిపారు. అయితే ఆమె చనిపోలేదని తెలుసుకొని నాలుక కరుచుకున్న శశిథరూర్ వెంటనే ట్వీట్ తొలగించారు..

మరో ట్వీట్‌లో శశిథరూర్ ఇది నకిలీ వార్త అని.. చూసుకోకుండా సుమిత్ర చనిపోయారని ట్వీట్ చేశానని.. క్షమాపణలు కోరారు. ఆమెకు “దీర్ఘాయువు” అని శుభాకాంక్షలు తెలిపారు.

" నేను ఉపశమనం పొందుతున్నాను. నమ్మదగిన వార్తలు ఏంటో తెలియడం లేదు. ఫేక్ వార్తలపై క్షమాపణ చెప్పి ఉపసంహరించుకోవడం సంతోషంగా ఉంది. ఎవరైనా ఇలాంటి వార్తలను తయారు చేస్తారా.. ఇది భయపెడుతోంది" అని థరూర్ మరొక ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇంతలో బిజెపి ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గియా హిందీలో  దీనిపై క్లారిటీ ఇచ్చారు. " సుమిత్రా మహాజన్ ఆరోగ్యంగా.. చక్కగా ఉన్నారు. దేవుడు ఆమెకు సుదీర్ఘ జీవితాన్ని ఇస్తాడు" ఆమె మరణించలేదన్న వాస్తవాన్ని వెల్లడించారు.
Tags:    

Similar News