శ‌శి థ‌రూర్‌ కు ఊహించ‌ని వరం.. !

Update: 2018-07-05 06:48 GMT
కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్‌ కు ఉప‌శ‌మ‌నం ద‌క్కింది. త‌న భార్య‌ సునంధ పుష్కర్ మృతి కేసులో ఆయ‌న‌కు ముంద‌స్తు బెయిల్ దొరికింది. ఈ తీర్పు విష‌యంలో ఉత్కంఠ చోటుచేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన చార్జిషీటును విచారణకు స్వీకరించిన ఢిల్లీ కోర్టు.. జులై 7న కోర్టుకు రావాల్సిందిగా థరూర్‌కు సమన్లు జారీ చేసింది. థరూర్‌ పై విచారణ జరపడానికి తగిన ఆధారాలు ఉన్నాయని కోర్టు నమ్ముతున్నట్లు అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సమర్ విశాల్ చెప్పారు. దీంతో ఈ సీనియ‌ర్ నాయ‌కుడికి శిక్ష ఖాయ‌మ‌ని అంచ‌నాలు వెలువ‌డ్డాయి.

2014 - జనవరి 7న ఢిల్లీలోని ఓ లగ్జరీ హోటల్‌లో సునందా అనుమాస్పద స్థితిలో మృతిచెందింది. ఐపీసీలోని సెక్షన్ 498ఏ - 306 కింద శశిపై కేసులను నమోదు చేశారు. సునంధను ఆత్మహత్యకు ప్రేరేపించడం - అనారోగ్యంతో ఉన్న భార్య పట్ల అమానుషంగా వ్యవహరించినట్లు థరూర్‌ పై ఆరోపణలు ఉన్నాయి. తాను ఆత్మహత్య చేసుకునే ముందు సునంధ పుష్కర్ రాసిన ఓ కవితను చార్జిషీటు దాఖలు సందర్భంగా ఢిల్లీ పోలీసులు కోర్టు ముందు ఉంచారు. ఆమె మరణించే కొన్ని రోజుల ముందే ఆ కవితను సునంధ.. థరూర్‌ కు ఈమెయిల్ చేసినట్లు పోలీసులు చెప్పారు. నాకు చావాలని లేదు.. చనిపోవాలని ప్రార్థిస్తున్నా అని అందులో సునంధ రాసింది. థరూర్ తన భార్యను వేధించినట్లు తమ 3 వేల పేజీల చార్జిషీటులో పోలీసులు స్పష్టంచేశారు. దీనిప్రకారం సునంధను ఎవరూ చంపలేదని, ఆమెనే ఆత్మహత్య చేసుకున్నదని కూడా పోలీసులు తేల్చారు.ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన చార్జిషీటును విచారణకు స్వీకరించిన ఢిల్లీ కోర్టు.. జులై 7న కోర్టుకు రావాల్సిందిగా థరూర్‌ కు సమన్లు జారీ చేసింది. 

తాజాగా ఢిల్లీలోని పాటియాలా హౌజ్ కోర్టు తాజాగా ఈ పిటిష‌న్‌ పై వాద‌న‌లు విని తీర్పు వెలువ‌రించింది. సునందా పుష్కర్ మృతి కేసులో బెయిల్‌ మంజూరు చేస్తూ.. ముందస్తు బెయిల్ కోసం ఆయన లక్ష రూపాయల బెయిల్ బాండ్‌ ను సమర్పించాల్సిందిగా ఆదేశించింది. అయితే, శశి థరూర్ దేశాన్ని విడిచి వెళ్లరాదంటూ తన ఆదేశాల్లో కోర్టు స్పష్టంగా పేర్కొంది. సునందా మృతి కేసులో శనివారం శశి కోర్టు ముందు హాజరుకానుండ‌గా అడ్వకేట్ వికాశ్ ఆయన తరపున బెయిల్ పిటీషన్ వేశారు.

అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌ - ఎంపీ సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి త‌న‌దైన శైలిలో స్పందించారు. శశిథరూర్‌ కు వేడుక చేసుకునేంత విషయమేమీ లేదని ఎద్దేవా చేశారు. ఆయనకు బెయిల్‌ వచ్చింది కానీ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి లేదని - ప్రపంచంలోని వివిధ దేశాలలో ఉన్న తన గర్ల్‌ ఫ్రెండ్స్‌ ను కలవలేరని ఎద్దేవా చేశారు. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ - ఆయ‌న త‌ల్లి సోనియా గాంధీపై సెటైర్ల్ వేశారు. బెయిల్‌ వాలాలు అయిన త‌ల్లికొడుకుల‌ను అడిగి ఈ బెయిల్ విష‌యంలో కలిసి కూర్చోవచ్చని వ్యాఖ్యానించారు.
Tags:    

Similar News