ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా తమ పార్టీ సంక్షోభంలో ఉందని అంగీకరించడానికి ఇష్టపడడు. కానీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశి థరూర్ మాత్రం ఇదే మాట అంటున్నాడు. ఐతే ఆయన చెబుతున్నది పార్టీ ఆర్థిక పరిస్థితి గురించి. నిధులు నిండుకోవడం గురించి. ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు మీ సహకారం కావాలి. విరాళాలు అందించి మాకు సహాయం చేయండి అంటూ’ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్లో విన్నవించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ లాంటి పెద్ద పార్టీ ఇలా పిలుపునివ్వడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఐతే ఇందులో తప్పేముందని ప్రశ్నించాడు థరూర్. తాము అధికారంలో లేం కాబట్టి ఈ ఇబ్బంది సహజమే అని ఆయనన్నారు.
‘‘ప్రస్తుతం అత్యధిక విరాళాలు అందుకుంటున్న పార్టీ బీజేపీ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే అధికారం ఉన్న వారి దగ్గరికే డబ్బు కూడా వెళ్తుంది. ఆ కారణంగానే ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీలన్నీ చిన్నపాటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీకి ఇబ్బంది తప్పడం లేదు’’ అని ఓ జాతీయ ఛానెల్ తో మాట్లాడుతూ థరూర్ అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు చాలా మంది సొంత డబ్బే ఖర్చు చేశారని.. ఒకవేళ తాము పెద్ద మొత్తంలో విరాళాలు సేకరించడంలో విజయం సాధించినట్లైతే వచ్చే సాధారణ ఎన్నికల్లో ఇదే ఫలితం పునరావృతమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం బీజేపీ రూ.1034.27 కోట్ల ఆదాయంతో ఉన్నట్లు ఓ నివేదిక పేర్కొంది. ఆ పార్టీ ఆదాయం రూ. 463.41 కోట్లమేర పెరిగిందట. కాంగ్రెస్ పార్టీ ఆదాయం 14 శాతానికి పడిపోయినట్లు ఈ నివేదిక పేర్కొంది.