కాంగ్రెస్ సీనియర్ నేత - కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ చిక్కుల్లో పడ్డారు. అప్పట్లో ఆయన కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు ఆయన భార్య సునంద పుష్కర్ అనుమానాస్పద హత్య కేసు ఆయన మెడకు చుట్టుకున్న సంగతి తెలిసిందే.. తాజాగా ఈ కేసులో అరెస్ట్ కాకుండా ఉండేందుకు మంగళవారం కోర్టు మెట్లు ఎక్కాడు. ఢీల్లీ కోర్టులో ఆయన ముందస్తు బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు..
ఈ కేసుకు సంబంధించి ఇటీవల ఢిల్లీ కోర్టు శిశథరూర్ ను నిందితుడిగా గుర్తిస్తూ జూలై 7న విచారణకు హాజరుకావాల్సిందిగా సమన్లు జారీ చేసింది. అయితే తనపై ఆరోపణలు నిరాధారమైనవిగా.. సునంద పుష్కర్ మృతితో తనకు సంబంధం లేదని శశిథరూర్ వాదిస్తున్నారు.
అయితే ఢిల్లీ పోలీసులు మాత్రం ఆయనపై అభియోగాలు మోపారు. దాదాపు 3వేల పేజీల చార్జిషీట్ లో సునంద పుష్కర్ హత్య కేసులో ఆయన ప్రమేయం ఉందని చెబుతూ నిందితుడిగా పేర్కొన్నారు. భార్య పట్ల థరూర్ క్రూరంగా వ్యవహరించారని అందులో చేర్చారు.
2014 జనవరి 17న ఢిల్లీలోని హోటల్లో సునంద పుష్కర్ ఆత్మహత్య చేసుకున్నట్టు మొదట వార్తలు వచ్చాయి. అయితే అది ఆత్మహత్య కాదు.. హత్య అని పోలీసుల విచారణలో తేలింది. అందులో ఆమె భర్త శశిథరూర్ ప్రమేయముందని పోలీసులు చార్జిషీట్ లో పేర్కొన్నారు. దీంతో బెయిల్ కోసం శశిథరూర్ ప్రయత్నాలు చేస్తున్నారు.