కాస్టింగ్ కౌచ్ పై బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ - కాంగ్రెస్ నేత రేణుకాచౌదరి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. వీరి వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండగా...బీజేపీ ఎంపీ - ప్రముఖ నటుడు శతృఘ్న సిన్హా సమర్థించారు. క్యాస్టింగ్ కౌచ్ అంశంలో ఎవరి నిర్ణయం వారు తీసుకుంటారని, అది వ్యక్తిగత నిర్ణయమని ఆయన అన్నారు. లైంగిక ఆనందాలు అనేవి అటు వినోదరంగంలోనూ - ఇటు రాజకీయ రంగంలోనూ ఉన్నాయని బీజేపీ ఎంపీ శత్రుఘ్నసిన్హా చెప్పారు. కాస్టింగ్ కౌచ్ పై బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ - కాంగ్రెస్ నేత రేణుకాచౌదరి చేసిన వ్యాఖ్యలు సరైనవేనని సిన్హా చెప్పారు. `నన్ను ఆనందపరిస్తే - నేను నిన్ను ఆనంద పరుస్తాను అనేది దీంట్లో అంతస్సూత్రం. అది చాలా రోజులుగా ఉన్న పద్ధతే. జీవితంలో ముందుకెళ్లడానికి కొన్నిసార్లు కాలం డిమాండ్ చేసినట్లుగా నడుచుకోక తప్పదు`అని సిన్హా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
బాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ విషయంలో ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను ఆయన విశ్లేషిస్తూ అమ్మాయిని, అబ్బాయినీ ఎవరూ బలవంత పెట్టరని ఆయన అన్నారు. `ఒకరు తన కావాల్సిన దాని కోసం మరొకటి ఇస్తున్నారు. అలాగే ఇతరులు కూడా తమ వద్ద ఉన్నది ఇస్తూ కావాల్సింది పొందుతున్నారు. ఇందులో బలవంతం ఏముంది?` అని షాట్ గన్ వివాదాస్పద సందేహాన్ని లేవనెత్తారు. బాలీవుడ్‌లో కొరియోగ్రఫీకి సరోజ్‌ఖాన్ అందించిన సేవలు అనితరసాధ్యమని ఆయన కొనియాడారు. రేఖ - మాధురీ దీక్షిత్ తోపాటు శ్రీదేవి వంటి అనేక మంది తారల కెరీర్ ను తీర్చి దిద్దడంలో కీలక పాత్ర పోషించిన సరోజ్ ఖాన్…నిజమే చెబుతారని అన్నారు. ఆమె తరచూ తన మనసులో మాట చెబుతారని కూడా వెల్లడించారు. బాలీవుడ్ లో అమ్మాయిలు రాజీపడుతున్నారని ఆమె అన్నారంటే కచ్చితంగా ఆమెకు తెలిసే ఉంటుందని శతృఘ్నసిన్హా అన్నారు. `సినిమాల్లోకి రావడానికి అమ్మాయిలు ఎలా రాజీ పడాల్సి వస్తున్నదో నాకు తెలుసు. ఆమె వ్యాఖ్యలను నేను పూర్తిగా అంగీకరిస్తాను` అని సిన్హా చెప్పారు.
అంతేకాకుండా పార్లమెంటులో కూడా కాస్టింగ్ కౌచ్ ఉందనే కాంగ్రెస్ ఎంపీ రేణుకాచౌదరి వ్యాఖ్యలతోనూ తాను ఏకీభవిస్తానని శత్రుఘ్నసిన్హా తెలిపారు. `బహుశా రాజకీయాల్లో దాన్ని కాస్టింగ్-వోట్-కౌచ్ అనాలేమో. ఔత్సాహికులు అవకాశాల కోసం లైంగిక ఆనందాలు ఇవ్వటానికి సిద్ధమవుతుంటే, సీనియర్ నేతలు వాటిని అంగీకరిస్తున్నారు. ఇలాంటివి సరైనవేనని నేను చెప్పట్లేదు. నాకెప్పుడూ ఇలాంటి అనుభవం ఎదురుకాలేదు` అని శత్రుఘ్నసిన్హా అభిప్రాయపడ్డారు. సరోజ్ ఖాన్ - రేణుకా చౌదరి వ్యాఖ్యలను ఖండించవద్దని, అలాంటి వాతావరణానికి దారితీసే పరిస్థితుల్ని ఖండించాలని ఆయన కోరారు.