షాట్ గ‌న్ అంత ప‌ని చేశాడా?

Update: 2015-11-08 09:44 GMT
షాట్ గ‌న్ గా సుప‌రిచితుడైన శ‌త్రుఘ్న‌సిన్హా మీద క‌మ‌ల‌నాథులు క‌స్సుమంటున్నారు. ఇప్పుడాయ‌న పేరు చెబితేనే వారు మండిప‌డుతున్నారు. ఆయ‌న‌తో పాటు పార్టీకి కీల‌క‌మైన ఆర్ కే సింగ్ లు సైతం త‌మ పార్టీని ముంచేశార‌ని బాధ ప‌డిపోతున్నారు. ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు.. బీజేపీ నేత అయిన శ‌త్రుఘ్న సిన్హాతో పాటు ఆర్‌ కే సింగ్ కార‌ణంగా బీహార్ లోపార్టీ పూర్తిగా మునిగిపోయింద‌ని క‌మ‌ల‌నాథులు వాపోతున్నారు.

క‌మ‌ల‌నాథుల వేద‌న‌కు కార‌ణం లేక‌పోలేదు. బీహార్ ఎన్నిక‌ల్లో శ‌త్రుఘ్న‌సిన్హా.. ఆర్ కే సింగ్ లు కీల‌క‌భూమిక పోషించారు. వారి క‌నుస‌న్న‌ల్లోనే మెజార్టీ స్థానాల వ్య‌వ‌హారాలు చూశారు. అయితే.. అభ్య‌ర్థుల ఎంపిక‌లో ప‌లు అసంతృప్తుల‌కు వారు కార‌ణ‌మ‌య్యార‌న్న‌ది బీజేపీ నేత‌ల వాద‌న‌. తాజాగా ఎన్నిక‌ల ఫ‌లితాలు చూస్తే.. ఎనిమిది జిల్లాల్లో బీజేపీ ప్రాతినిధ్యం వ‌హించ‌క‌పోవ‌టం చూసిన‌ప్పుడు క‌మ‌ల‌నాథులు కంగుతింటున్నారు.
బిహార్ ఓట‌మిలో ఈ ఎనిమిది జిల్లాల పాత్ర పెద్ద‌దేన‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

ఈ ఎనిమిది జిల్లాల ఫ‌లితాల‌కు శ‌త్రుఘ్న‌సిన్హా.. ఆర్‌ కేసింగ్ లే కార‌ణంగా చెబుతున్నారు. అందుకే.. ఓట‌మితో కంగుతిన్న బీజేపీ నేత‌లు ఇప్పుడు కార‌ణాలు వెతికే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా శ‌త్రుఘ్న సిన్హాపై వెన్నంటి త‌మ‌ను మోసం చేశాడ‌ని.. న‌మ్మ‌క‌ద్రోహం చేశార‌ని మండిప‌డుతున్నారు. షాట్ గ‌న్ మీద చ‌ర్య‌ల‌కు వారు ప‌ట్టుబ‌డుతున్నారు. మ‌రి.. ఈ ఆరోప‌ణ‌ల‌కు షాట్ గ‌న్ ఎలా రియాక్ట్ అవుతాడో..?
Tags:    

Similar News