గతానికి భిన్నమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. కాల మహిమ అనాలో.. లేదంటే సమాచార విప్లవం వల్ల అన్ని విషయాలు అందరికి తెలుస్తున్నాయని అనుకోవాలో? లేదంటే.. ఇప్పటి తరానికి దూకుడు ఎక్కువైందో కానీ.. ప్రేమల పేరుతో చోటు చేసుకుంటున్న పరిణామాలు షాకింగ్ గా మారుతున్నాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి వెలుగు చూసింది. రోటీన్ కు భిన్నమైన రిలేషన్లు.. వాటి ప్రేమల్లో కథ కంచికి కాకుండా కాటికి పోతున్న వైనాలు ఎక్కువ అవుతున్నాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది.
ఒక కుర్రాడు తనకంటే పెద్దదైన మేనత్తను ప్రేమించాడు. ఆమెకు కూడా అతగాడంటే ఇష్టమేనని చెప్పేసింది. ఒకసారి ప్రేమ అనుకున్న తర్వాత ఆగరు కదా. హద్దులు దాటేశారు.. మధ్యలో ఉన్న గీతను చెరిపేశారు. ఏడాది పాటు సాగిన వారి ప్రేమాయణాన్ని కట్ చేస్తే.. ఆమె గర్బవతి అయ్యింది. ఆ విషయం తెలిసే సరికి ఆర్నెల్ల పసిగుడ్డు పొట్టలో పెరుగుతున్నాడు. దీంతో ధైర్యం చేసిన కుర్రాడు ఇంట్లో వాళ్లకు తమ ప్రేమాయణాన్ని చెప్పేశాడు.
అందుకు ఇరు కుటుంబాల వారు ససేమిరా అన్నారు. పెళ్లి వగైరాలకు సమస్యే లేదని తేల్చేశారు.అయితే.. అమ్మాయి.. అబ్బాయి పెద్దల్ని ఒప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ.. ఫెయిల్ అయ్యారు. దీంతో వారిద్దరు ఇంటి నుంచి పారిపోయారు. దగ్గర్లోని సోన్ నది వంతెన మీద నుంచి దూకేశారు. నది మధ్యలో ఉన్న ఇసుక తిన్నెల మీద పడి ఉన్న వారిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
రంగంలోకి దిగిన పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ప్రాణాలు తీసుకున్నట్లు చెప్పారు. దీంతో.. వీరి ప్రేమకథ విషాదంతంగా మారింది. మిగిలిన వారికి భిన్నంగా వ్యవహరిస్తూ ప్రేమాయాణం సాగించిన వారు ధైర్యంగా బతకాల్సింది పోయి.. చనిపోవటాన్ని కొందరు తప్పు పడుతున్నారు. మరికొందరు మాత్రం.. ఇలాంటివి ఇలా విషాదాంతాలుగా మారతాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.