దేశంలోనే అత్యంత సంపన్న మహిళ ఆమె.. ఆస్తి ఎంతంటే?

Update: 2022-07-28 04:38 GMT
దేశంలోనే అత్యంత ధనిక మహిళ ఎవరు? అన్న ప్రశ్నకు తాజాగా సమాధానం వచ్చేసింది. అంతేకాదు.. దేశంలో సంపన్న టాప్ 100 మహిళల జాబితాను తీస్తే.. అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన సంపన్న మహిళామణుల జాబితా పెద్దదిగా ఉండటం ఆసక్తికరంగా మారింది.

ఇంతకీ దేశంలోనే అత్యంత సంపన్న మహిళ మరెవరో కాదు.. ప్రఖ్యాత టెక్ కంపెనీ హెచ్ సీఎల్ టెక్నాలజీస్ కు ఛైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్న రోష్ని నాడార్ మల్హోత్రానే. 2021లో ఆమె నికర సంపద 54 శాతం పెరిగి రూ.84,330 కోట్లకు చేరినట్లుగా తాజాగా విడుదలైన కోటక్ ప్రైవేట్ బ్యాంకింగ్ - హురున్ జాబితా వెల్లడించింది.

తర్వాతి స్థానాన్ని ఇన్వెస్టు బ్యాంకింగ్ ప్రొఫెషన్ ను వదులుకొని సొంతంగా ఎదిగిన 59 ఏళ్ల ఫల్గుణి నాయర్ అగ్ర స్థానంలో నిలిచారు. ఆమె సంపద 963 శాతం పెరిగి రూ.57,520 కోట్లకు చేరుకుంది. బయోకాన్ కిరణ్ మజుందార్ షా నికర సంపద మాత్రం భారీగా తగ్గింది.

దీంతో ఆమె సంపద రూ.29,030 కోట్లకు చేరి మూడో స్థానంలో నిలిస్తే.. నాలుగో స్థానంలో తెలుగు ప్రాంతానికి చెందిన దివీస్ ల్యాబ్స్ కు చెందిన నీలిమ నిలిచారు. భారత్ లో పుట్టి లేదంటే పెరిగిన 100 మంది సంపన్న మహిళల జాబితాను సిద్ధం చేశారు. వీరి మొత్తం సంపద 2020లో రూ.2.72 లక్షల కోట్లు ఉంటే.. ఏడాదిలో అది కాస్తా రూ.4.16 లక్షల కోట్లుకు చేరటం గమనార్హం. ఇది భారత జీడీపీలో 2 శాతానికి సమానమని చెబుతున్నారు.

టాప్ 100 జాబితాలో నిలిచిన మహిళళ సంపద ఏడాది వ్యవధిలో కనీసం రూ.100 కోట్ల నుంచి రూ.300కోట్లకు పెరగటం ఒక విశేషంగా చెప్పాలి. ఈ జాబితాలో దేశంలోని వివిధ ప్రాంతాల వారు ఉండగా.. అత్యధికులు ఢిల్లీ మహానగరానికి చెందిన వారు 25 మంది ఉంటే.. ముంబయి 21 మంది ఉన్నారు.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. సంపన్న మహిళలు ఉన్న నగరంగా ముంబయి రెండో స్థానంలో ఉండే.. హైదరాబాద్ 12 మందితో మూడో స్థానంలో నిలిచింది. అపోలో హాస్పిటల్స్ కుచెందిన నలుగురు ఈ జాబితాలో పేరు ఉండటం మరో విశేషంగా చెప్పాలి. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సతీమణి నారా భువనేశ్వరి రూ.480 కోట్లతో 77 స్థానంలో నిలిచారు. టాప్ 100లో నిలిచిన సంపన్న మహిళల్ని చూస్తే..

ర్యాంక్    పేరు                   కంపెనీ పేరు               ఆస్తి విలువ (రూ.కోట్లల్లో)
04    నీలిమ                    దివీస్ ల్యాబ్స్                   28,180
13     మహిమా దాట్ల         బయోలాజికల్ ఇ               5530
15     సునీతా రెడ్డి             అపోలో హాస్పిటల్స్             4760
18     సుచరితా రెడ్డి           అపోలో సింధూరి హోటల్స్     3700
21     శోభనా కామినేని       అపోలో హాస్పిటల్స్              2740
23     సంగీతారెడ్డి              అపొలొ హాస్పిటల్స్             2690
29     ప్రీతా రెడ్డి                అపోలో హాస్పిటల్స్              2230
50     ఎన్. నవీన             దేవి సీ ఫుడ్స్                      980
50     పి. రమాదేవి           దేవి సీ ఫుడ్స్                      980
55     వనజాదేవి             కావేర సీడ్                          880
58     స్వర్ణలత గాలివీటి     సీఎల్ ఆర్ ప్రాజెక్ట్స్                850
66     సుప్రితా ఎస్ రెడ్డి      విజయా డయాగ్నోస్టిక్స్          590
69     సుచిత్రా ఎల్ల           భారత్ బయోటెక్                  570
72     పద్మజ గంగిరెడ్డి       స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్స్  520
77     నారా భువనేశ్వరి      హెరిటేజ్ ఫుడ్స్                    480
83     శాలిని భూపాల్, ఇందిరా క్రిష్ణారెడ్డి  తాజ్ జీవీకే          440
93     ఉమాదేవి చిగురుపాటి    గ్రాన్యూల్స్ ఇండియా          350
97     అంజనా రెడ్డి              యూనివర్సల్ స్ట్పోర్ట్ బిజ్       300
Tags:    

Similar News