పెళ్లి ..ప్రతి ఒక్కరి జీవితంలో మరచిపోలేని ఒక మధురమైన అనుభూతి. దీనితో ప్రతి ఒక్కరు కూడా పెళ్లి ని తమ బంధువులు , స్నేహితుల మధ్య అంగరంగ వైభవంగా జరుపుకోవాలి అని అనుకుంటారు, అలాగే పెళ్లి లో డ్యాన్సులు చేయడం అనేది సర్వసాధారణం. అలాగే మరికొంతమంది పెళ్లిలో డ్యాన్స్ షో కూడా పెట్టిస్తుంటారు. ఆలా పెళ్ళికి వచ్చిన వారికి వినోదాన్ని పంచుతుంటారు. కానీ , కొని కొన్ని సార్లు కొందరి వల్ల అనుకోని సంఘటనలు ఎదురవుతుంటాయి. అలాగే తాజాగా లక్నోలో జరిగిన ఒక పెళ్లి వేడుక లో డ్యాన్స్ వేస్తూ మధ్యలో ఆపివేసిందన్న కారణంతో మహిళ ని తుపాకీ తో కాల్చి చంపేశాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్లో చోటుచేసుకుంది.
పూర్తి వివరాలు చూస్తే ... గ్రామ పెద్ద అయిన సుధీర్ సింగ్ పటేల్ కుమార్తె వివాహంలో ఈ దారుణం జరిగింది. డిసెంబర్ 1న లక్నోలో జరిగిన ఈ పెళ్లి వేడుకలో డ్యాన్స్ షో ఏర్పాటు చేసారు. ఈ డ్యాన్స్ షో లో డ్యాన్స్ చేస్తున్న మహిళని ఓ వ్యక్తి యువతిని బెదిరించాడు. డ్యాన్స్ వేయడం ఆపివేస్తే బుల్లెట్లు దూసుకెళుతాయని బెదిరించాడు. కానీ చివరకు అదే జరిగింది. పెళ్లి వేడుకలో వేదికపై డ్యాన్స్ చేస్తున్న యువతి ఒక్కసారిగా డ్యాన్స్ ఆపేసింది. అయితే డ్యాన్స్ ఆపేస్తే చంపేస్తానంటూ బెదిరించాడు సుధీర్ అనే వ్యక్తి. అయితే పక్కనే ఉన్న మరో వ్యక్తి డ్యాన్స్ చేయడం ఆపేసింది... తుపాకీతో కాల్చేయ్ అని రెచ్చగొట్టడం తో యువతిని తుపాకీ తో కాల్చేశాడు. దీనితో ఆ మహిళ అక్కడికక్కడే కుప్పకూలింది.
ఇక అదే వేదికపై ఉన్న పెళ్లి కొడుకు మేనమామలు, మితిలేష్, అఖిలేష్లకు కూడా గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. అయితే పోలీసుల కథనం ప్రకారం సుధీర్ సింగ్ బంధువుల్లో ఒకరు ఈ కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. అయితే ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని అధికారులు తెలిపారు. పారిపోయిన వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీస్ ఉన్నతాధికారి అంకిత్ మిట్టల్ చెప్పారు. మరోవైపు కాన్పూర్లో గాయపడిన యువతి చికిత్స జరుగుతోందని అయితే ఆమె పరిస్థితి కాస్త విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇలాంటి ఘటనలు గతంలో కూడా కొన్ని జరిగాయి. 2016లో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. పంజాబ్లోని భాటిండాలో కుల్విందర్ కౌర్ అనే యువతి పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తుండగా కాల్పులు జరిగాయి.