గుంటూరులోని ఒక ఇంజినీరింగ్ కాలేజీలో చదివిన అమ్మాయికి.. ఏడాదికి రూ.60 లక్షల వార్షిక ప్యాకేజీతో జాబ్ సాధ్యమా? అంటే.. రావూరి పూజిత నిలువెత్తు ఎగ్జాంఫుల్ గా నిలుస్తున్నారు. తాజాగా ఆమె సాధించిన విజయం వెనుక ఆమె పడిన కష్టం గురించి తెలిస్తే.. గ్రామీణ ప్రాంతాల్లోనూ.. పెద్దగా నెట్ వర్కుకు అవకాశం లేని చోట ఉండి కూడా అద్భుతాలు సాధించటం ఎలా అన్నది ఇట్టే తెలుసుకోవచ్చు. టెక్నాలజీ ప్రపంచాన్ని చిన్న కుగ్రామంగా మార్చేసిందన్నది ఎంత నిజమో.. దాన్ని సరైన రీతిలో ఒడిసి పట్టాలే కానీ.. అనూహ్య విజయాల్ని ఎంతలా సాధించొచ్చు అన్న విషయాన్ని ఈ బీటెక్ తాజాగా పూర్తి చేసిన అమ్మాయి జీవితాన్ని చూస్తే అర్థమైపోతుంది.
గుంటూరుకు చెందిన పూజిత విషయానికి వస్తే.. తండ్రి బ్యాంకు ఆఫీసర్. తల్లి ఇంట్లోనే ఉంటారు. ఇంట్లో ఉన్న ఇద్దరు అమ్మాయిల్లో పెద్దది. జేఈఈలో జార్ఖండ్ బిట్స్ లో సీటు వస్తే.. అమ్మాయివి.. అంత దూరం ఎలా వెళతావని అంటే.. గుంటూరులోని ఒక ఇంజినీరింగ్ కాలేజీలో చేరింది. అలా చేరిన మొదటి ఏడాదే పాడు కరోనా రావటం.. లాక్ డౌన్ పెట్టేయటంతో కాలేజీకి వెళ్లే పరిస్థితి లేకపోయింది.
అవకాశాలు తగ్గినప్పుడు.. దారులు మూసుకుపోయినప్పుడు.. ప్రతికూలతల్ని సానుకూలతగా మార్చుకునే పద్దతి ఉంటుంది. సరిగ్గా ఆ వ్యూహాన్నే అమలు చేసింది పూజిత. ఆన్ లైన్ క్లాసులు అర్థం కాకపోతే.. లైట్ తీసుకోకుండా.. స్నేహితులతో అనవసరమైన బాతాకానీలోకి వెళ్లకుండా.. యూట్యూబ్ వీడియోల్ని చూసేది. ఏ ఐటీ కంపెనీ అయినా కోడింగ్ మీద ఎక్కువ పట్టు ఉన్న వారికే ప్రాధాన్యత ఇస్తుందన్న విషయాన్ని గుర్తించి.. తనకున్న లాజికల్ థింకింగ్ కు కోడింగ్ లో నైపుణ్యాన్ని పెంచుకోవటానికి మక్కువ చూపింది.
కోడింగ్ మీద మరింత కసరత్తు చేయటంతో పాటు.. దాని మీద పలు వెబ్ సైట్ల సాయాన్ని తీసుకునేది. ఆన్ లైన్ క్లాసులు అయ్యాక.. తర్వాత తన నైపుణ్యాల్ని మరింత మెరుగు పర్చుకునేందుకు ఆన్ లైన్ లో సొంతంగా శిక్షణ తీసుకోవటం మొదలు పెట్టింది. తనకు తానే టెస్టులు పెట్టుకునేది. తన తప్పుల్ని గుర్తించేది. వాటిని అధిగమించటానికి ఆన్ లైన్ లో పలువురు సీనియర్ల సాయాన్ని.. సలహాల్ని తీసుకునేది.
లీడ్ కోడ్.. కోడ్ షెఫ్.. ప్రెప్ బైట్స్.. బైనరీ సెర్చ్ డాట్ కాం లాంటి సైట్లలో కోడింగ్.. ఇతర అంశాల్ని నేర్చుకోవటంతో పాటు.. టైం మేనేజ్ మెంట్ మీద మరింత మెరుగుపర్చుకునే అంశంపై ఫోకస్ పెట్టేది. ఇంటర్వ్యూలలో మిగిలిన వారి కంటే మెరుగ్గా ఉండేందుకు వీలుగా ప్రత్యేక శిక్షణ తీసుకుంది. కట్ చేస్తే.. అమెజాన్.. అడోబ్.. గూగుల్ లాంటి సంస్థల్లో ఆఫర్ సొంతం చేసుకుంది.
మిగిలిన కంపెనీలతో పోలిస్తే.. గూగుల్ రూ.60 లక్షల భారీ ప్యాకేజీ ఆఫర్ చేయటంతో.. ఆ సంస్థలో చేరేందుకు ఓకే చెప్పేసింది. ఇక్కడ చెప్పేదేమంటే.. పరిమిత అవకాశాలు మాత్రమే తమకు ఉన్నాయి అని భావించే వారు.. ఇంటర్నెట్ అనే అనంత అవకాశాల గని ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు. తాము ఎంత తవ్వుకుంటే అంత ఇవ్వటానికి ఇంటర్నెట్ ఉన్నప్పుడు.. చుట్టూ ఉన్న అవకాశాల గురించి చింతించాల్సిన అవసరం లేదన్నది మర్చిపోకూడదు. సో.. రావూరి పూజిత మాదిరి ఆలోచిస్తే.. ఎంతో మంది మరెన్నో అవకాశాల్ని సొంతం చేసుకోవచ్చన్న విషయాన్ని మర్చిపోకూడదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.