సుదీర్ఘ న్యాయవిచారణ జరిగిన తర్వాత.. ఉగ్రవాది అన్న విషయం పక్కా ఆధారాలతో తేలిన తర్వాత.. న్యాయస్థానం ఉరిశిక్ష విధించటం. దానికి సవాలక్ష అవాంతరాలు. రాజకీయ ఒత్తిళ్ల తర్వాత కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఉరిని అమలు చేయాల్సి వస్తే.. దాన్ని అమలు చేసేందుకు ఏళ్లకు ఏళ్లకు తరబడి వెయిట్ చేయటం.. అలా వెయిట్ చేసి ఉరిని అమలు చేస్తుంటే నిరసనలు వ్యక్తం చేయటం లాంటివి భారత్ లో చూస్తుంటాం.
ఉగ్రవాదులు.. ఉగ్రవాద కార్యకలాపాల్ని జాతి వ్యతిరేక శక్తుల పన్నాగంగా చూసే కన్నా.. వారి మతాన్ని చూపిస్తూ.. ఆయన మత నాయకులు మాట్లాడటం.. కోర్టు తీర్పును.. తప్పు పట్టే విచిత్రమైన పరిస్థితి మన దేశంలో కనిపిస్తుంది. తాజాగా సౌదీ అరేబియాలో చూస్తే.. నోట మాట రాని పరిస్థితి. కేవలం ప్రభుత్వ వ్యతిరేక విధానాల్ని ప్రశ్నించటం.. నిరసన వ్యక్తం చేయటం.. అది కూడా శాంతియుతంగా చేపట్టిన దానికి ఎలాంటి మొహమాటంలేకుండా భారీ ఎత్తున ఉరిశిక్షను అమలు చేసిన తీరు చూస్తే నోట మాట రాని పరిస్థితి. మతం మీద రాజకీయాలు చేసే నేతలు ఎవరూ కిక్కురమనకుండా ఉండటమే కాదు.. సౌదీ చేసిన దుర్మార్గాన్ని విశ్వవ్యాప్త బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం నోరు విప్పని దైన్యం కనిపిస్తుంది.
ప్రముఖ షియా మత గురువు షేక్ నిమ్ర్ ఆల్ నిమ్ర్ ను సౌదీ అరేబియా ఎలాంటి మొహమాటానికి తావు లేకుండా ఉరి తీసింది. ఆయనతో పాటు.. మరో 46 మందికి ఉరిశిక్షను హోల్ సేల్ గా అమలు చేసింది. పలు దేశాల వారు వ్యతిరేకిస్తున్నా.. సౌదీలోని షియాల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నా సౌదీ సర్కారు అస్సలు పట్టించుకోలేదు. సున్ని.. షియా పంచాయితీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు.
ఈ పంచాయితీలో భాగంగా.. షియాల మీద ఉక్కుపాదం మోపుతున్న సౌదీ సర్కారు.. మత గురువును సైతం ఉరి తీసేందుకు వెనుకాడలేదు. తాజా పరిణామంతో షియాల్లో అగ్రహం కట్టలు తెంచుకుంది. అయితే.. సౌదీ లాంటి దేశంలో నిరసనలు హద్దు దాటితే.. ఉరి వేసేసే అవకాశం ఉంది. చిన్న చిన్న తప్పులకు దారుణ శిక్షలు అమలు చేయటం సౌదీకి కొత్తేం కాదు. తాజాగా మత గురువు ఉరిపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఉగ్రవాదులకు.. అతివాదులకు సౌదీ సర్కారు దన్నుగా నిలుస్తుందని.. కానీ స్వదేశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని అణిచివేయటంపై ఆందోళన వ్యక్తం చేసింది.
ఇలాంటి విధానాలకు సౌదీ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందంటూ ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జబీర్ అన్సారీ వ్యాఖ్యలు చేయటం చూస్తే.. పరిస్థితి ఎంత హాట్ గా ఉందో ఇట్టే తెలుస్తుంది. మరి.. సౌదీలో షియా మతగురువును ఉరి తీత మీద.. మూర్తీభవించిన మానవత్వం ఉన్నట్లుగా వ్యవహరించే పలువురు ముస్లిం మేధావులు.. సెలబ్రిటీలు ఎందుకు నోరు విప్పరు..? తమ ఆవేదనను వ్యక్తం చేయరో..?