దేశంలో ప్రధానపార్టీలైన కాంగ్రెస్ - బీజేపీలకు ఢిల్లీ పీఠం ఎక్కాలంటే ఆ రాష్ర్టమే కీలకం. ఆ రాష్ర్టంపై పట్టుసాధిస్తే చాలు ఢిల్లీ పీఠం ఎక్కే విషయంలో సగం సక్సెస్ అయినట్టే. అందుకే ఆ రాష్ర్టానికి జరిగే ఎన్నికలకు 2019 ఎన్నికలకు సెమీఫైనల్స్ గా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ రాష్ర్టమే ఉత్తరప్రదేశ్. యూపీ ఎన్నికల్లో విజయం సాధించి...వరుసగా పోతున్న తమ ప్రతిష్టను నిలుపుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం యూపీ ఎన్నికలపై ప్రధానంగా దృష్టి సారించనుంది.
ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధిష్టానం యూపీ సీఎం అభ్యర్థి పేరు ప్రకటించింది. ఎన్నికలకు చాలా రోజుల ముందే కాంగ్రెస్ తన సీఎం అభ్యర్థి ఎవరో అధికారికంగా తేల్చేసింది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి - సీనియర్ నాయకురాలు షీలా దీక్షిత్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. వాస్తవానికి యూపీ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి విషయంలో ఇప్పటికే రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. తొలుత రాహుల్‌ను, ఆ తర్వాత ప్రియాంకను సీఎం అభ్యర్ధిగా ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి.
అయితే చివరకు షీలాను అభ్యర్థిగా అధిష్టానం చేసింది. ఈ విషయాన్ని యూపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ గులాం నబీ ఆజాద్ ప్రకటించారు.దేశంలోనే కీలకమైన ఎన్నికలు అయిన యూపీలో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇప్పటికే యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాజ్ బబ్చర్ ను నియమించింది. గాంధీ-నెహ్రూ కుటుంబాలకు చెందిన వారసురాలైన ప్రియాంక ఛరిష్మాను వాడుకుని ఆమె వ్యూహాలతో ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని కాంగ్రెస్ ప్రణాళికలు వేస్తోంది.
ఇక కాంగ్రెస్ తరపున యూపీ సీఎం అభ్యర్థిగా ఎంపికైన షీలా దీక్షిత్ గతంలో ఢిల్లీ సీఎంగా పనిచేశారు. ఆమె భర్త యూపీలో గతంలో ఐఏఎస్ గా పనిచేశారు. యూపీలో బలంగా ఉన్న బ్రాహ్మణ సామాజికవర్గాన్ని ఆకట్టుకునే క్రమంలోనే కాంగ్రెస్ షీలాను తమ సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. ఒకప్పుడు యూపీలో బ్రాహ్మణులంతా కాంగ్రెస్ వైపే ఉండేవారు. అయితే తర్వాత వీరు బీజేపీ వైపు మొగ్గు చూపారు. ఇక బీఎస్పీ వారికి ఎక్కువ టిక్కెట్లు ఇవ్వడంతో చాలామంది బీఎస్పీ వైపు మొగ్గు చూపారు. ఇక ఇప్పుడు వీళ్లను తిరిగి తనవైపునకు తిప్పుకునే క్రమంలోనే కాంగ్రెస్ ఈ ప్లాన్ తో ముందుకు వెళుతోంది.