అఖిలేష్ విష‌యంలో మ‌హిళా నేత హ‌ర్ట‌య్యారు

Update: 2017-01-17 13:24 GMT
ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ లో అధికార‌ స‌మాజ్ వాదీ పార్టీలో నెల‌కొన్న ప్ర‌కంప‌న‌లు ఇత‌ర పార్టీల‌కు సైతం సోకుతున్నాయి. అఖిలేష్ పార్టీతో దోస్తీ ఉంటుంద‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత గులామ్ న‌బీ ఆజాద్ స్ప‌ష్టంచేశారు. దీనికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే అని కూడా తేల్చి చెప్పేశారు. మ‌రి అదే జ‌రిగితే కాంగ్రెస్ నుంచి సీఎం అభ్య‌ర్థిగా ఉన్న షీలా దీక్షిత్ ప‌రిస్థితి ఏంటి? ఇది కాంగ్రెస్ నేత‌ల్లో మొద‌లైన చ‌ర్చ‌. దీనిపై కాంగ్రెస్‌ లో కూడా క‌ల‌వ‌రం మొద‌లైంది. ఏకంగా ఢిల్లీ మాజీ సీఎం, యూపీ ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థి షీలా దీక్షిత్ వ‌ర‌కు చేరింది.

అఖిలేష్ నాయ‌కత్వంలోనే ఎస్పీతో కాంగ్రెస్ పొత్తు ఉంటుంద‌ని ఆజాద్ నొక్కి చెప్పారు. ప్ర‌స్తుతానికైతే ఇది కాంగ్రెస్‌ - ఎస్పీ బంధ‌మేన‌ని - మ‌హా కూట‌మిపై ఇంకా ఆలోచ‌న చేయాల్సి ఉంది అని ఆజాద్ అన్నారు. బీహార్‌ లో జేడీయూ - ఆర్జేడీల‌తో చేతులు క‌లిపిన కాంగ్రెస్.. బీజేపీని అధికారానికి దూరం చేసింది. దీంతో యూపీలోనూ అదే ప్ర‌ణాళిక అమ‌లు చేసే అవ‌కాశం లేక‌పోలేదు. ఈ నేప‌థ్యంలో త‌న‌కు సీఎం సీటు ద‌క్క‌ద‌ని తెలుసుకున్న షీలా మీడియాతో మాట్లాడారు. ఎస్పీ- కాంగ్రెస్ చేతులు క‌లిపితే తాను సీఎం రేసు నుంచి త‌ప్పుకుంటాన‌ని షీలా ప్ర‌క‌టించారు. రెండు పార్టీలు క‌లిసి బ‌రిలోకి దిగితే సీఎం అభ్య‌ర్థిగా ఎలాగూ అఖిలేషే ఉంటారు. అందుకే నేను తప్పుకుంటా. ఇద్ద‌రు సీఎం అభ్య‌ర్థులు ఉండే అవ‌కాశం లేదు. ఎస్పీ, కాంగ్రెస్ పొత్తుల‌పై చర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఇది యూపీకి ల‌బ్ధి చేకూర్చేదే. హైక‌మాండ్ ఏం చెబితే నేను అది చేస్తా అని షీలా స్ప‌ష్టం చేస్తూనే త‌న మ‌నో వేద‌న‌ను ప‌రోక్షంగా వెళ్ల‌డించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News