అసదుద్దీన్ ఓవైసీ.. ఎంఐఎం అధినేత.. హైదరాబాద్ పాత బస్తీలో పుట్టిన ఈ ముస్లిం పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించి ముస్లింల పార్టీగా మార్చేశాడు. ముస్లింల హక్కుల కోసం పోరాడుతున్నాడు. తాజాగా అయోధ్య వివాదంపై అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘తమకు తమ బాబ్రీ మసీదును తిరిగి ఇవ్వాలంటూ’ డిమాండ్ చేశారు. దీనిపై తాజాగా ఇద్దరు మండిపడ్డారు..
కేంద్రమంత్రి బాబుల్ సుప్రీయో తాజాగా ఓవైసీపై నిప్పులు చెరిగారు. దేశంలో ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న జాకీర్ నాయక్ తో ఓవైసీని పోల్చి ఎండగట్టాడు. జాకీర్ నాయక్ ముస్లిం యువతను తన ప్రసంగాలతో రెచ్చగొట్టి ఉగ్రవాదాన్ని పెంచుతున్నారని.. ఓవైసీ కూడా అలాంటి వాడేనని మండిపడ్డారు. ఇలానే మాట్లాడితే చట్టం తన పని తాను చేస్తుందని ఓవైసీని హెచ్చరించాడు.
ఇక ఓవైసీని తాజాగా మరో ముస్లిం సంఘం కూడా విమర్శించడం హాట్ టాపిక్ గా మారింది. ఉత్తరప్రదేశ్ షియా వక్ఫ్ బోర్డు చైర్మన్ వసీం రిజ్వి తాజాగా ఓవైసీపై నిప్పులు చెరిగారు. ఓవైసీని ఇటీవలే మరణించిన ఐసిస్ ఉగ్ర సంస్థ అధిపతి అబూ బాకర్ అల్ బాగ్దాదీతో పోల్చాడు. బాగ్దాదీ లాగే ఓవైసీ కూడా తన ప్రసంగాలతో ముస్లింలను రెచ్చగొడుతూ దేశంలో రక్తపాతాన్ని ప్రోత్రహిస్తున్నాడని సంచలన కామెంట్ చేశారు. బాగ్దాదీ సైన్యం, మారణ ఆయుధాలతో ముస్లిం యువతను రెచ్చగొడుతూ రక్తపాతం సృష్టిస్తే.. ఓవైసీ తన ప్రసంగాలతో రక్తపాతం సృష్టిస్తున్నాడని మండిపడ్డారు. ముస్లిం పర్సనల్ లా బోర్డు వెంటనే ఓవైసీపై నిషేధం విధించాల్సిన సమయం ఆసన్నమైందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరప్రదేశ్ షియా వక్ఫ్ బోర్డు చైర్మన్ వసీం రిజ్వి తాజాగా బీజేపీకి మద్దతు పలికారు. ఇటీవలే అయోధ్యలో రామమందిర ఆలయ నిర్మాణానికి 51వేల విరాళం కూడా ఇచ్చారు. ఈ అంశంపై కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించారు. ఈ క్రమంలోనే ఓవైసీపై రిజ్వి చేసిన సంచలన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.