అరంగేట్రంతోనే రికార్డులు బద్ధలుగొడుతూ ఇండియన్ క్రికెట్ టీంలోకి వచ్చిన డ్యాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఆ తరువాత కాలంలో పెద్దగా బద్ధలుగొట్టిందేమీ లేదు కానీ, తాజాగా నిన్న కోల్ కోతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం తమ జట్టు సన్ రైజర్స్ కే చెందిన ఓ ల్యాప్ టాప్ ను మాత్రం బద్ధలుగొట్టేశాడు. అయితే, అది ఉద్దేశపూర్వకంగా చేసిన పనేమీ కాదు.
కోల్ కతాతో మ్యాచ్ సందర్భంగా శిఖర్ కొట్టిన ఓ షాట్ కు జట్టు కీలక ప్రణాళికలు - వీడియోలు ఉన్న అత్యాధునిక సోనీ ల్యాప్ టాప్ పగిలిపోయింది. ట్రెంట్ వేసిన రెండో ఓవర్ మొదటి బంతిని శిఖర్ ధావన్ - బౌండరీ లైన్ ను దాటించగా, అది అనలిస్ట్ శ్రీనివాస్ ముందున్న ల్యాప్ టాప్ వెనుక భాగాన్ని బలంగా తాకింది. అంతే... ల్యాప్ టాప్ స్క్రీన్ భళ్లున పగిలిపోయింది. ల్యాపీ స్విచ్చాఫ్ అయింది.
అయితే.. అక్కడే ఉన్న సన్ రైజర్స్ జట్టు మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ - ఎంత పనిచేశావు? అన్నట్టు ధావన్ వైపు ఓ లుక్కేసి, 'ఎలా చేశాడో చూడండి' అన్నట్టు కోచ్ టామ్ మూడీ - మరో బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్ లకు ల్యాప్ టాప్ ను చూపించాడట. అయితే... లక్ష్మణ్ కోపం శిఖర్ పై కాదని... బంతి వస్తున్నప్పుడు ల్యాపీని తీయకుండా తాను మాత్రమే తప్పించుకున్న అనలిస్టు శ్రీనివాస్ పై ఆగ్రహించాడని కూడా చెబుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/