ధావన్ వరుసగా రెండు 'సున్నాలు' చుట్టేశాడు

Update: 2020-10-31 17:05 GMT
ఐపీఎల్లో ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొడుతోంది. చాలా రోజుల పాటు పాయింట్ల పట్టిక లో ప్రాజెక్టుగా అగ్రస్థానం. టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఈ టోర్నీలో అద్భుతంగా ఆడుతూ వచ్చాడు. ఢిల్లీ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. రెండు వరుస సెంచరీలు సాధించి రికార్డులు సృష్టించాడు. టోర్నీ ఆరంభంలో వరుసగా మ్యాచులు గెలుస్తూ వచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పుడు వరుసగా మ్యాచ్ లు కోల్పోతోంది. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత సెంచరీ కొట్టిన ధావన్‌ ఆ తర్వాత కింగ్స్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ మరోసారి శతకంతో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్‌లో వరుసగా రెండు సెంచరీలు సాధించిన బ్యాట్స్ మెన్ ఎవరూ లేరు. అలాంటి రికార్డు సాధించిన ధావన్‌ ఆ వెంటనే జరిగిన రెండు వరుస మ్యాచ్ లలో సున్నాలు చుట్టాడు.

సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సందీప్‌ శర్మ వేసిన తొలి ఓవర్‌ మూడో బంతికి ధావన్‌ పరుగులేమి చేయకుండా అవుటయ్యాడు. శనివారం ముంబై ఇండియన్స్‌ తో జరిగిన మ్యాచ్‌లో కూడా గబ్బర్ మరోసారి విఫలమై డకౌట్ అయ్యాడు. ట్రెంట్‌ బౌల్డ్‌ వేసిన మొదటి ఓవర్‌ మూడో బంతికి పరుగుల ఖాతా మొదలుపెట్టక ముందే ముందే సూర్యకుమార్‌ యాదవ్‌ పట్టిన క్యాచ్‌ తో ఔట్ అయ్యాడు.

ఒక టోర్నమెంట్లో వరుసగా రెండు సెంచరీలు సాధించి, తరువాత రెండు మ్యాచ్ లలో డకౌట్ అయిన బ్యాట్స్ మెన్ గా ధావన్ రికార్డ్ సృష్టించాడు. కాగా ఈ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ 9 వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది. 111 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ముంబయి 14.2 ఓవర్లలో 1 వికెట్ మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ 47 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సులతో 72 పరుగులు సాధించాడు. ఓపెనర్ ఓపెనర్ డికాక్ 26 పరుగులు చేశాడు.
Tags:    

Similar News